NTV Telugu Site icon

Sudheer Babu: సూపర్ స్టార్ కృష్ణ ప్రథమ వర్థంతి.. సుధీర్‌ బాబు ఎమోషనల్‌ పోస్ట్‌

Superstar Krishna

Superstar Krishna

2022 ఘట్టమనేని కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు అన్నయ్య.. రమేష్‌ బాబు, తల్లి ఇందిరా దేవి, తండ్రి సూపర్‌ స్టార్‌ కృష్ణ నెలల వ్యవధిలోనే కన్నుమూశారు. సూపర్‌ స్టార్‌ కృష్ణ మరణం సినీ ఇండస్ట్రీనే కాదు తెలుగు రాష్ట్రాల అభిమానులను సైతం శోకసంద్రంలో ముంచింది. గతేడాది నవంబర్‌ 15న కృష్ణ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. నేడు ఆయన ప్రథమ వర్థంతి. ఈ సందర్భంగా టాలీవుడ్‌ సినీ పరిశ్రమ ఆయనను గుర్తు చేస్తుకుంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అలాగే ఆయన అల్లుడు, హీరో సుధీర్‌ బాబు కృష్ణ వర్థంతి సందర్భంగా ఎమోషనల్‌ అయ్యాడు. ఆయనను గుర్తు చేసుకుంటూ ట్విటర్‌(X)లో పోస్ట్‌ షేర్‌ చేశాడు.

Also Read: Karthika Nair: కాబోయే భర్తను పరిచయం చేసిన హీరోయిన్‌

”మామయ్య , మీకు మాకు ఉన్న దూరం ఎంత? కలవరిస్తే కలలోకి వచ్చేంత, తలచుకుంటే మా గుండెల్లో బ్రతికేంత. ఆగిపోలేదు మీ ప్రస్థానం, ఆరిపోలేదు మా అభిమానం. మరువను నేను, మరువదు నేల. మీ కీర్తి, మీ స్పూర్తి … అమరం …. అద్భుతం” సుధీర్‌ బాబు భావోద్వేగానికి లోనయ్యాడు. కాగా ఇటీవల మామ మశ్చీంద్ర సినిమాతో అలరించిన సుధీర్‌ బాబు ప్రస్తుతం హరోం హ అనే పాన్‌ ఇండియా సినిమా చేస్తున్నాడు. దీపావళి సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేశాడు సుధీర్‌ బాబు. ఇక సుధీర్‌ బాబుతో పాటు మంజుల ఘట్టమనేని కూడా తండ్రిని గుర్తు చేసుకుంటు ఎమోషనల్‌ అయ్యారు. అలాగే ఇతర కుటుంబ సభ్యుల కూడా కృష్ణతో ఉన్న అనుబంధాన్ని, జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సోషల్‌ మీడియా వేదికగా ఎమోషనల్‌ అయ్యారు. ఇక కృష్ణ వర్థంతి సందర్భంగా మహేష్‌ మరిన్ని సేవ కార్యక్రమాలను మొదలు పెట్టారు. ఎంబీ ఫౌండేషన్‌ పేరుతో చిన్నారులక హార్ట్‌ ఆపరేషన చేయిస్తున్న మహేష్‌.. ఈ ఫౌండేషన్‌ ద్వారా చిన్నారుల చదువు కోసం ఉపకారవేతనాలు కూడా ఇవ్వనున్నట్టు ఆయన భార్య నమ్రత తాజాగా ప్రకటించింది.

Also Read: Bigg Boss : కన్నడ బిగ్ బాస్ కంటెస్టెంట్ తనీషాపై పోలీస్ కేసు..