Site icon NTV Telugu

Naari Naari Naduma Murari : డబ్బా థియేటర్స్‌కు మళ్లీ కళ తెచ్చిన హీరో శర్వానంద్

Sharwanad

Sharwanad

ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు సినిమాలు చూడడం తగ్గిపోవడంతో చాలా పాత థియేటర్లు, ముఖ్యంగా డబ్బా థియేటర్స్, వెలవెలబోతున్నాయి. కింద సెంటర్స్ లో కొన్ని కొన్ని థియేటర్స్ ను మూసేశారు కూడా. అలాంటి పరిస్థితుల్లో కూడా రెండు సార్లు ఆ థియేటర్స్‌ను కలకళలాడించి సూపర్ హిట్‌లు అందుకున్న హీరోగా శర్వానంద్ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.

Also Read : Pooja Hegde : నా క్యారవాన్ లోకి దూరి నాపై చేయి వేసిన పాన్ ఇండియా హీరోను చెంపదెబ్బ కొట్టాను

 శర్వా సినిమాల ట్రాక్ రికార్డ్ చూస్తే 2016 లో ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ సినిమాతో శర్వానంద్ సూపర్ హిట్ కొట్టాడు. స్టార్ హీరోల సినిమాలు ఉన్నా కూడా పోటీగా వచ్చి ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టించాడు. ఆ సినిమా అప్పట్లో చిన్నసెంటర్స్‌తో పాటు పాత థియేటర్లలో కూడా ఊహించని స్థాయిలో వసూళ్లు సాధించి హౌస్‌ఫుల్ బోర్డులు పెట్టించింది. ఆ తర్వాత చాలా కాలం పాటు అలాంటి సక్సెస్ మళ్లీ చూడలేదు శర్వా. ఇక పదేళ్ల తర్వాత ఈ ఏడాది సంక్రాంతి కానుకగా  ఇప్పుడు ‘నారి నారి నడుమ మురారి’ సినిమాతో శర్వానంద్ మరోసారి అదే ఫీట్‌ను రిపీట్ చేశాడు. భారీ సినిమాల మధ్య నారి నారి కేవలం కొన్ని థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఈ  సినిమా ఎక్కువగా  చాలా  సెంటర్స్‌లో పాత థియేటర్లలోనే రిలీజ్ అయినప్పటికీ, అక్కడ ప్రేక్షకులు రావడమే అరుదైన రోజుల్లో కూడా ఈ చిత్రం వరుసగా నాలుగు రోజుల పాటు హౌస్‌ఫుల్ షోస్‌తో నడవడం విశేషం. డబ్బా థియేటర్స్‌లో ఆడియన్స్‌ను తిరిగి తీసుకురావడం అంత సులువు కాదు. కానీ శర్వానంద్ తన కంటెంట్‌ ఎంపికతో, ప్రేక్షకులను ఆకట్టుకునే నటనతో మరోసారి అది సాధ్యమయ్యేలా చేశాడని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ విజయంతో శర్వానంద్‌కు హిట్ రావడమే కాదు మూసివేతకు రెడీ ఉన్న థియేటర్స్ కు మళ్లీ కాసుల పంట పండించాడని చెప్పాలి.

Exit mobile version