NTV Telugu Site icon

గ్రీన్ కో చర్యల పట్ల హర్షం వ్యక్తం చేసిన చరణ్

దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆక్సిజన్ కొరత ఆందోళన కలిగిస్తోంది. కరోనా బాధితుల అత్యధికులకు ఆక్సిజన్ అవసరమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రాణవాయువుకు విపరీతమైన డిమాండ్ ఏర్పడగా, గ్రీన్ కో సంస్థ చైనా నుంచి 1000 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను, పెద్ద సంఖ్యలో సిలిండర్లను తెప్పించి తెలంగాణ ప్రభుత్వానికి అందించింది. దీనిపై టాలీవుడ్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పందిస్తూ.. గ్రీన్ కో సంస్థకు అభినందనలు తెలిపారు. కరోనా కష్టకాలంలో తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా అనేక ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్లను అందిస్తోందని కొనియాడారు. గ్రీన్ కో తన స్నేహితుడికి చెందిన సంస్థ అని రామ్ చరణ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.