NTV Telugu Site icon

Masthan Sai: హీరో నిఖిల్ ఫోన్ హ్యాక్.. హార్డ్ డిస్కులో ప్రయివేటు వీడియోలు?

Masthan Sai

Masthan Sai

రాజ్ తరుణ్-లావణ్య వ్యవహారంలో కీలకంగా వినిపించిన పేరు మస్తాన్ సాయి. గుంటూరుకు చెందిన మస్తాన్ సాయి ఇప్పుడు మరో వివాదం లో చిక్కుకున్నాడు. మస్తాన్ సాయి సెక్స్ వీడియోలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. రాజ్ తరుణ్ భార్యగా చెప్పుకుంటున్న లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో వెలుగులోకి ఈ వ్యవహారం వచ్చింది. 300 మంది అమ్మాయిలను నగ్నంగా మస్తాన్ సాయి వీడియోలు తీశాడని, ప్రేమ, పెళ్లి పేరుతో అమ్మాయిలన లోబర్చుకుంటున్నాడని లావణ్య ఆరోపించింది. బెడ్ రూముల్లో కెమేరాలు పెట్టి శృంగార దృశ్యాలు రికార్డ్ చేసిన మస్తాన్ సాయి, అమ్మాయిలతో నగ్నంగా చేసిన వీడియోకాల్స్ రికార్డ్ చేసిన వైనం బయట పెట్టింది. అన్ని వీడియోలను తన హార్డ్ డిస్కులో రికార్డ్ చేసిన మస్తాన్ సాయి గురించి లావణ్య పేజీల లేఖ ద్వారా ఫిర్యాదు చేసింది. లావణ్యను అత్యాచారం చేసి ఆ వీడియోలు రికార్డ్ చేసిన మస్తాన్ ని తన వీడియోలు డిలీట్ చేయాలని అఢిగిన లావణ్యపై దాడి చేశాడని పేర్కొంది.

Lavanya – Raj Tarun: లావణ్య-రాజ్ తరుణ్ కేసులో మస్తాన్ సాయి అరెస్ట్?

అమ్మాయిలను డ్రగ్స్ కు బానిసలను చేసి లోబర్చుకుంటున్న మస్తాన్ సాయి 4 టీబీ హార్డ్ డిస్క్ లో 300మంది అమ్మాయిల వీడియోలు ఉన్నాయని, ఆ వీడియోలను పోర్న్ వెబ్ సైట్ లో పెడతానంటూ బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడే వాడని లావణ్య వెల్లడించింది. భయంతో వీడియోకాల్స్ వ్యవహారాన్ని ఇంతవరకు బాధిత యువతులు బయటపెట్టలేదని, తన వీడియోల కోసం మస్తాన్ సాయి దగ్గర హార్డ్ డిస్క్ ను తీసుకొచ్చిన లావణ్య తన వీడియోల కోసం సెర్చ్ చేస్తుండగా బయటపడిన మిగిలిన అమ్మాయిల వీడియోల గురించి బయట పెట్టింది. వరలక్ష్మి టిఫిన్స్ యజమాని ప్రభాకర్ రెడ్డి, హీరో నిఖిల్ ఫోన్లను హ్యాక్ చేసిన మస్తాన్ సాయిహీరో నిఖిల్, ప్రభాకర్ రెడ్డి ప్రైవేట్ వీడియోలను సైతం హార్డ్ డిస్క్ లో దాచినట్టు పేర్కొంది. ఇక హార్డ్ డిస్క్ వెనక్కి ఇవ్వాలంటూ లావణ్యపై దాడి చేసిన మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ ఇవ్వనందుకు లావణ్యను చంపే ప్రయత్నం చేసినట్టు ఆరోపించింది. తనతో పాటు వందలాది మంది అమ్మాయిల జీవితాలను కాపాడాలని పోలీసులను కోరిన లావణ్య, 300మంది అమ్మాయిల వీడియోలు ఉన్న హార్డ్ డిస్క్ ను పోలీసులకు అప్పగించచింది. ప్రస్తుతం మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.