హీరో మంచు విష్ణు ఓ మంచి పని హాట్ టాపిక్ అవుతోంది. తిరుపతిలోని బైరాగి పట్టెడ ప్రాంతానికి చెందిన మాతృశ్య సంస్థకు చెందిన 120 మంది అనాథలను హీరో మంచు విష్ణు దత్తత తీసుకున్నారు. విద్యా, వైద్యంతో పాటు అన్ని విషయంలో ఓ కుటుంబ సభ్యుడిలా తోడుంటానని ఆయన తెలిపారు. ఎలాంటి స్వలాభం లేకుండా మంచి హృదయంతో మాతృశ్య నిర్వాహకురాలు శ్రీదేవి 120 మందికి పైగా అనాథలను ఆదరిస్తున్నారని, వారికి అన్నగా, పెద్దగా తోడు ఉంటానని, వారంతా నా కుటుంబ సభ్యులే అని అన్నారు. ఇక వారితో పండుగ చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు విష్ణు. తానే కాదని అందరూ అనవసరమైన ఖర్చులు తగ్గించుకుని అందుబాటులో ఉన్న అనాథలకు సాయం చేయాలని ఆయన కోరారు.
Daaku Maharaaj: డాకు మహారాజ్ ఆల్ టైమ్ రికార్డు.. డే1 కలెక్షన్స్ ఎన్ని కోట్లు అంటే?
ఇక ఈ ఉదయం తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో మోహన్‌బాబు, విష్ణు పాల్గొన్నారు. భోగి మంటలు వేసి సంతోషంగా గడిపి తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. ‘‘ప్రతి రోజు బాగుండాలని భగవంతుడిని కోరుకుంటాం, అందరూ బాగుండాలి అని అన్నారు. సంక్రాంతి అంటే రైతు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. ఇలాంటి పండగలను ఆనందంగా జరుపుకోవచ్చు. సినిమా మిత్రులకు వారు తీసిన సినిమా హిట్ అయితేనే నిజమైన పండగ, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, కరవు కాటకాలు రాకూడదని, రైతు బాగుండాలని కోరుకుంటున్నా. జాగ్రత్తగా పండగ చేసుకోండి’’ అంటూ అందరికీ సంక్రాంతి విషెస్ చెప్పారు మోహన్ బాబు. ఇక అందరికీ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు విష్ణు చెప్పారు.