NTV Telugu Site icon

Hero Karthi: హీరో కార్తీ ఫేస్‌ బుక్‌ అకౌంట్‌ హ్యాక్‌

Karthi1

Karthi1

Hero Karthi Facebook Account Hacked: తమిళ, తెలుగు ప్రేక్షకులకు కార్తీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హీరో కార్తీ తెరపైనే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన అభిమానులను అలరిస్తుంటాడు. కార్తీ సోషల్‌ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉన్నాడు. కార్తీ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయిందట. ఈ మేరకు కార్తీ ట్వీట్ చేస్తూ తన అభిమానులను అలర్ట్ చేశాడు. హలో గైస్.. నా ఫేస్‌బుక్ బుక్‌ హ్యాక్ చేయబడింది.. మేము ఫేస్‌బుక్ టీమ్‌తో కలిసి పని చేస్తున్నాము.. నా పేజీని రికవరీ చేయడానికి ప్రయత్నిస్తున్నాము.

హీరో కార్తీ ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. మణిరత్నం పొన్నియిన్ సెల్వన్‌లో వల్లవరయ్యగా అలరించాడు. మొదటి భాగం అంతా కార్తీ చుట్టూనే తిరుగుతుంది. ఈ సినిమా కోలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తాజాగా ఆయన సర్దార్ అంటూ అందరినీ ఆశ్చర్యపరిచారు. పీఎస్ మిత్రన్ మరోసారి మ్యాజిక్ చేశాడు. వాటర్ బాటిల్ స్కామ్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం సర్దార్. ఇందులో కార్తీ నటన అద్భుతం. కార్తీ కొత్త సినిమా జపాన్ అప్‌డేట్ ఈరోజు రానుంది. ఈ సినిమాలో కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది. సునీల్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ నిర్మిస్తోంది.

హ్యాక్ అయిన అకౌంట్ ఇదే..

సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ కావడం కొత్తేమీ కాదు. ఎప్పుడూ ఎవరిదో ఒకరిది ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఇలా హ్యాక్ అవుతూనే ఉన్నాయి. కానీ కొన్నిసార్లు ఇవి చెడు ఫలితాలకు కూడా దారితీస్తాయి. కొద్దిరోజుల క్రితం విష్ణుప్రియ ఫేస్ బుక్ పేజ్ హ్యాక్‌ అవడంతో ఎంత ఇబ్బంది పడిందో అందరికీ తెలిసిందే. విష్ణుప్రియ ఫేస్ బుక్ పేజీ నిండా అసభ్యకరమైన వీడియోలు, ఫోటోలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు విష్ణుప్రియ తన ఫేస్‌బుక్ ఖాతా సమస్యలను పరిష్కరించలేకపోయింది. అయితే ఇక తాజాగా కార్తీ ఫేస్‌ బుక్‌ హ్యాక్‌ అవడంతో సినీ ఇండస్ర్టీలో గందరగోళం నెలకొంది. ఎప్పుడు ఎవరిది సోషల్‌ మీడియా ఖాతాలు హ్యాక్‌ అవుతాయేమో అని టెన్సన్ మొదలైంది.

Naomi Biden: జో బిడెన్ మనవరాలి వివాహం.. వైట్‌హౌజ్‌లో జరుగుతున్న ఎన్నో పెళ్లో తెలుసా..?

Show comments