Hero Karthi: హీరో కార్తీ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hero Karthi Facebook Account Hacked: తమిళ, తెలుగు ప్రేక్షకులకు కార్తీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హీరో కార్తీ తెరపైనే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన అభిమానులను అలరిస్తుంటాడు. కార్తీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉన్నాడు. కార్తీ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయిందట. ఈ మేరకు కార్తీ ట్వీట్ చేస్తూ తన అభిమానులను అలర్ట్ చేశాడు. హలో గైస్.. నా ఫేస్‌బుక్ బుక్ హ్యాక్ చేయబడింది.. మేము ఫేస్‌బుక్ టీమ్‌తో కలిసి పని చేస్తున్నాము.. నా పేజీని రికవరీ చేయడానికి ప్రయత్నిస్తున్నాము.
Hello guys, my Facebook page has been hacked. We are trying to restore it with Fb team.
Also Read
- Hanuman Sentiment: గురూజీకి కలిసొరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
- Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
— Karthi (@Karthi_Offl) November 14, 2022
హీరో కార్తీ ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. మణిరత్నం పొన్నియిన్ సెల్వన్‌లో వల్లవరయ్యగా అలరించాడు. మొదటి భాగం అంతా కార్తీ చుట్టూనే తిరుగుతుంది. ఈ సినిమా కోలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తాజాగా ఆయన సర్దార్ అంటూ అందరినీ ఆశ్చర్యపరిచారు. పీఎస్ మిత్రన్ మరోసారి మ్యాజిక్ చేశాడు. వాటర్ బాటిల్ స్కామ్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం సర్దార్. ఇందులో కార్తీ నటన అద్భుతం. కార్తీ కొత్త సినిమా జపాన్ అప్‌డేట్ ఈరోజు రానుంది. ఈ సినిమాలో కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది. సునీల్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ నిర్మిస్తోంది.
హ్యాక్ అయిన అకౌంట్ ఇదే..

సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ కావడం కొత్తేమీ కాదు. ఎప్పుడూ ఎవరిదో ఒకరిది ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఇలా హ్యాక్ అవుతూనే ఉన్నాయి. కానీ కొన్నిసార్లు ఇవి చెడు ఫలితాలకు కూడా దారితీస్తాయి. కొద్దిరోజుల క్రితం విష్ణుప్రియ ఫేస్ బుక్ పేజ్ హ్యాక్ అవడంతో ఎంత ఇబ్బంది పడిందో అందరికీ తెలిసిందే. విష్ణుప్రియ ఫేస్ బుక్ పేజీ నిండా అసభ్యకరమైన వీడియోలు, ఫోటోలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు విష్ణుప్రియ తన ఫేస్‌బుక్ ఖాతా సమస్యలను పరిష్కరించలేకపోయింది. అయితే ఇక తాజాగా కార్తీ ఫేస్ బుక్ హ్యాక్ అవడంతో సినీ ఇండస్ర్టీలో గందరగోళం నెలకొంది. ఎప్పుడు ఎవరిది సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ అవుతాయేమో అని టెన్సన్ మొదలైంది.
Naomi Biden: జో బిడెన్ మనవరాలి వివాహం.. వైట్‌హౌజ్‌లో జరుగుతున్న ఎన్నో పెళ్లో తెలుసా..?
తాజావార్తలు
-
Hanuman Sentiment: గురూజీకి కలిసొరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
-
Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
-
INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
-
Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!