Site icon NTV Telugu

Dharma Mahesh : భార్యతో వివాదం..కొడుకు పేరుతో కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేసిన హీరో

Dharma Mahesh

Dharma Mahesh

ఈ మధ్యకాలంలో, హీరో ధర్మ మహేష్ అతని భార్య గౌతమి చౌదరి వరుసగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ, పోలీస్ కంప్లైంట్స్ ఇచ్చుకుంటూ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, హీరో ధర్మ మహేష్ ఒక ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నాడు. నిజానికి, ఈ జంట ఇద్దరూ కలిసి గిస్మత్ జైల్ మందీ అనే పేరుతో హైదరాబాద్ వ్యాప్తంగా రెస్టారెంట్స్‌ను నడిపేవారు. వివాదాల నేపథ్యంలో, ఆ బ్రాండ్ తనదంటే తనదని ఒకరికొకరు క్లెయిమ్ చేసుకుంటూ వచ్చారు. తాజాగా, Gismat పేరుతో మొన్నటి వరకు నడిచిన రెస్టారెంట్‌ను పేరు మార్చి Jismat గా ఈరోజు ప్రారంభించారు. తన కుమారుడు జగద్వజ పేరు మీద ఈ రెస్టారెంట్ మారుస్తున్నట్లుగా హీరో ధర్మ మహేష్ వెల్లడించాడు.

మందీ అనగానే భోజన ప్రియులకు ‘జిస్మత్’ ఎప్పుడూ మొదటి స్థానంలో ఉండాలని కోరుకుంటున్నామని ధర్మ మహేష్ తెలిపారు. అందుకే, మెనూలో నిరంతరం కొత్తదనాన్ని అందిస్తూ, చికెన్, మటన్, చేపలు, పన్నీర్ వంటి శాఖాహారం, మాంసాహారం రెండింటిలోనూ అత్యుత్తమ రుచులను అందుబాటులో ఉంచుతున్నామని వివరించారు.
డ్రింకర్ సాయి హీరో ధర్మ మహేష్ మాట్లాడుతూ, ‘జిస్మత్’ తన కొడుకు జగద్వాజ పట్ల ఉన్న స్వచ్ఛమైన ప్రేమ నుండి పుట్టిందని భావోద్వేగంతో తెలిపారు. ధర్మ మహేష్ కంపెనీ యాజమాన్యాన్ని పూర్తిగా తన కుమారుడు జగద్వాజకు అంకితం చేస్తున్నారు. అంటే, తన కొడుకు కోసం బిజినెస్ మొత్తం జగద్వాజ పేరు మీదకు మార్చనున్నారు. ఇక ఈ యాజమాన్యం బదిలీ పూర్తయ్యే వరకు, ఆయన కార్యకలాపాలు, విస్తరణను మహేష్ పర్యవేక్షిస్తారు.

Exit mobile version