Site icon NTV Telugu

“కేజీఎఫ్-2″లో రావు రమేష్ లుక్ విడుదల

Here's a glimpse of Rao Ramesh as Kanneganti Raghavan in KGF Chapter 2

‘కేజీఎఫ్’ మూవీతో ఓవర్ నైట్ ఆలిండియాలో మాస్ హీరో గా పేరు తెచ్చుకున్నాడు కన్నడ హీరో యశ్. నిజానికి అందులో మాస్ క్యారెక్టర్ ను సైతం ఎంతో క్లాస్ గా, సెటిల్డ్ గా చేయడంతో అందరి మనసుల్ని గెలుచుకున్నాడు. ప్రస్తుతం యశ్ ‘కేజీఎఫ్’ చాప్టర్ 2 రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తయిపోయిన ఈ సినిమాలో ఉత్తరాదికి చెందిన సంజయ్ దత్, రవీనాటాండన్ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. జులై 16న చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ‘కేజీఎఫ్2’ మళ్లీ వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. దసరాకు ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి తెలుగు నటుడు రావు రమేష్ లుక్ విడుదల చేశారు మేకర్స్. ‘కేజీఎఫ్: చాప్టర్ 2’లో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేష్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో రావు రమేష్ కన్నెగంటి రాఘవన్ గా సిబిఐ ఉన్నతాధికారిగా కనిపిస్తాడు. ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఫిల్మ్ యూనిట్ కేజీఎఫ్-2 నుంచి రావు రమేష్ లుక్ ను విడుదల చేసింది. చలన చిత్రంలో అతని పాత్ర గురించి సూచనలు ఇచ్చింది. ప్రత్యేకంగా రూపొందించిన వార్తాపత్రిక కథనాన్ని పంచుకుంటూ దర్శకుడు ప్రశాంత్ నీల్ ట్వీట్ చేశారు. రావు రమేష్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన పోస్టర్ లో “సిబిఐ అత్యున్నత అధికారి కన్నెగంటి రాఘవన్ పుట్టినరోజును ఈ రోజు. ఇప్పుడు సిబిఐ ఇంటరెస్ట్ ఏమిటి? కెజిఎఫ్ లేదా రాకీనా? నరాచీ సున్నపురాయి కార్పొరేషన్ వెనుక సత్యాన్ని ఆవిష్కరించడంలో రాఘవన్ విజయం సాధిస్తారా?” అనే హెడ్ లైన్స్ కేజీఎఫ్ టైమ్స్ మొదటి పేజీలో ప్రచురించబడ్డాయి.

https://twitter.com/prashanth_neel/status/1397047345418706946
Exit mobile version