వెట్రి మారన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం టైటిల్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. ‘విడుతలై’ అని మూవీ టైటిల్ ను ప్రకటిస్తూ విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ ను రెవీల్ చేశారు. ఇందులో విజయ్ సేతుపతి పోలీస్ స్టేషన్ లో పోలీసుల మధ్య సంకెళ్లతో కూర్చుని టీ తాగుతూ కన్పిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి పాత్ర పేరు వాతియార్. ‘విడుతలై’లో సూరి పోలీసుగా నటించారు. ఇటీవల సూరి ఓటు వేయడానికి బయటకు వచ్చినప్పుడు ఆయన లుక్ రివీల్ అయ్యింది. ఈ చిత్రం జెయా మోహన్ రాసిన నవల యొక్క చిన్న కథ ఆధారంగా రూపొందించబడింది. వెట్రిమారన్ మునుపటి చిత్రాలలాగే ఇది కూడా ఎడ్జ్-ఆఫ్-ది-సీట్ థ్రిల్లర్ గా బలమైన కంటెంట్ తో ఉండబోతోందని ఫస్ట్ లుక్ చూస్తుంటేనే అర్థమవుతోంది. ఈ సినిమా షూటింగ్ సత్యమంగళంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో జరిగింది. అక్కడ కనీసం కరెంట్, ఫోన్ సిగ్నల్ కూడా లేవట. కాగా ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్ పై ఎల్డ్రెడ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళంలో ఇతర భారతీయ భాషలలో ఒకేసారి విడుదల కానుంది. ఇలయరాజా ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రంలో భవానీ శ్రే లీడ్ రోల్ పోషిస్తోంది.
విజయ్ సేతుపతి నెక్స్ట్ మూవీ ‘విడుతలై’… ఫస్ట్ లుక్ రిలీజ్
