విజయ్ సేతుపతి నెక్స్ట్ మూవీ ‘విడుతలై’… ఫస్ట్ లుక్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెట్రి మారన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం టైటిల్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. ‘విడుతలై’ అని మూవీ టైటిల్ ను ప్రకటిస్తూ విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ ను రెవీల్ చేశారు. ఇందులో విజయ్ సేతుపతి పోలీస్ స్టేషన్ లో పోలీసుల మధ్య సంకెళ్లతో కూర్చుని టీ తాగుతూ కన్పిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి పాత్ర పేరు వాతియార్. ‘విడుతలై’లో సూరి పోలీసుగా నటించారు. ఇటీవల సూరి ఓటు వేయడానికి బయటకు వచ్చినప్పుడు ఆయన లుక్ రివీల్ అయ్యింది. ఈ చిత్రం జెయా మోహన్ రాసిన నవల యొక్క చిన్న కథ ఆధారంగా రూపొందించబడింది. వెట్రిమారన్ మునుపటి చిత్రాలలాగే ఇది కూడా ఎడ్జ్-ఆఫ్-ది-సీట్ థ్రిల్లర్ గా బలమైన కంటెంట్ తో ఉండబోతోందని ఫస్ట్ లుక్ చూస్తుంటేనే అర్థమవుతోంది. ఈ సినిమా షూటింగ్ సత్యమంగళంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో జరిగింది. అక్కడ కనీసం కరెంట్, ఫోన్ సిగ్నల్ కూడా లేవట. కాగా ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్ పై ఎల్డ్రెడ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళంలో ఇతర భారతీయ భాషలలో ఒకేసారి విడుదల కానుంది. ఇలయరాజా ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రంలో భవానీ శ్రే లీడ్ రోల్ పోషిస్తోంది.
Also Read
- స్టార్ హీరో లేడు.. భారీ ప్రమోషన్ లేదు.. రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూ.130 కోట్లు వసూళ్లు.. Hanuman Ansh ఫుల్ స్టోరీ ఇదే!
- Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
- Anand Deverakonda : వాళ్ళ సపోర్ట్ లేకుండా ఉంటే ఏమీ చేయలేక పోయేవాడిని!
- Raaka Remuneration: పుష్ప తర్వాత బన్నీ మార్కెట్ ఇదేనా? ‘రాకా’ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
తాజావార్తలు
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!
-
Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్‌కు షాక్.. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు దూరం.. అసలు కారణం ఇదే!
-
Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్‌తో మరింత ఆదా.!
-
CM Chandrababu: నేడు కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులతో ముఖాముఖి, పార్టీ కార్యకర్తలతో సమావేశం!
-
కేవలం 6.39 మి.మీ. మందం, 144Hz AMOLED డిస్‌ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO CAMON Slim 5G లాంచ్.!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!