NTV Telugu Site icon

Naveen Polishetty : ‘అనగనగా ఒకరాజు’ ప్రీ వెడ్డింగ్ ప్రోమో.. కెవ్వు కేక

Navin Polishetty

Navin Polishetty

తొలి సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతోనే హీరోగా సూపర్ హిట్ కొట్టాడు నవీన్ పోలిశెట్టి. జాతి రత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. ఇక లేడీ స్టార్ స్వీటీ శెట్టితో చేసిన మిస్టర్ శెట్టి.. మిసెస్ పోలిశెట్టి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని అనగనగా ఒక రాజు అనే సినిమా చేస్తున్నాడు నవీన్ పోలిశెట్టి. అప్పుడెప్పుడో స్టార్ట్ అయిన ఈ సినిమా అలా సాగుతూనే ఉంది.

కాగా నేడు చిత్ర హీరో నవీన్ పోలిశెట్టి పుట్టిన రోజు సందర్భంగా అనగనగా ఒక రాజు సినిమా నుండి ప్రీ వెడ్డింగ్ వీడియోను రిలీజ్ చేసారు. ముకేశ్ మావయ్య తో వీడియో కాల్ మాట్లాడుతూ మావయ్య నీకు వంద రీఛార్జ్ లు, ఇప్పుడే మన అనంత్ వెడ్డింగ్ క్యాసెట్ చూస్తున్న నువ్వు కాల్ చేసావ్. మన పెళ్లిలో నహాలీవుడ్ నుండి ఒక అమ్మాయి వచ్చింది చూడు కిమ్, అలాగే బేబీ అంటూ పాటలు పాడుకుంటూ తిరిగాడే జస్టిన్ బాబర్, మన శ్రీను గాడు అదే మామ కండలు ఎక్కువ బట్టలు తక్కువ జాన్ శ్రీను గాడు వీళ్ళ నంబర్స్ పెట్టు ఈ ఇయర్ అనంత్ గాడి వెడ్డింగ్ గాని, నెక్స్ట్ ఇయర్ మన రాజు వెడ్డింగ్ లో వెళ్ళతో డాన్స్ లు ఎపిస్తాను. అవును మరి అనంత్ పెళ్లి అయిపోయిందా ఇంకో రెండు సీజన్స్ ఉందా చెప్పు మామ అంటూ సాగిన ఈ ప్రోమో అదిరిపోయింది అనే చెప్పాలి.

Show comments