NTV Telugu Site icon

అలా మనసు మార్చుకున్నానంటున్న హేమ!

Hema Decision on MAA President Elections 2021

ఇప్పటికే ‘మా’ అధ్యక్ష పదవికి ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్ పోటీ పడుతుండగా ఇప్పుడు హేమ సైతం రంగంలోకి దిగింది. తాను ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న విషయాన్ని హేమ స్పష్టంచేసింది. ఏ పరిస్థితులలో తాను పోటీ పడుతున్నాననో కూడా తెలిపింది. ఆ విషయాన్ని ఆమె మాటల్లోనూ…

Read Also : కూతురికి సోనూసూద్ పేరు పెట్టుకున్న దంపతులు

“గ‌త కొన్నేళ్లుగా మా ఉపాధ్య‌క్షురాలిగా, సంయుక్త కార్య‌ద‌ర్శిగా, ఈసీ స‌భ్యురాలిగా పని చేశాను. ఆయా ప‌ద‌వుల‌కు న్యాయం చేశాను. ఈసారి కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘మా’ ఎన్నిక‌లు రానే వ‌చ్చాయి. ఈసారి కోశాధికారి ప‌ద‌వికి పోటీ చేయాల‌ని మొదట అనుకున్నాను. కానీ ఇప్పుడు నా ఆలోచ‌న మారింది. ప్ర‌కాష్ రాజ్ గారు, మంచు విష్ణు బాబు, జీవిత గారు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నార‌ని తెలిసింది. పెద్ద‌లంతా ఎల‌క్ష‌న్ బ‌రిలో దిగుతున్నారని తెలిశాక, పెద్ద‌ల వివాదాల్లో మ‌న‌మెందుకు చిక్కుకోవాలి? ఎందుకు పోటీప‌డాలి? అస‌లు పోటీ చేయొద్ద‌ని అనుకున్నాను. అయితే నిన్నటి నా ప్ర‌క‌ట‌న అనంత‌రం సినీప్ర‌ముఖుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొన్నాను. నేను ఉపాధ్య‌క్షురాలిగా పోటీ చేసిన‌ప్పుడు నన్ను గెలిపించిన నా స్నేహితులు, ముఖ్యంగా మహిళా సభ్యులు, సినీ ప్ర‌ముఖులంతా ఫోన్ చేసి ”నువ్వెందుకు పోటీ చేయ‌కూడ‌దు, నువ్వుంటే బావుంటుంది, ఎవ‌రైనా క‌ష్టాలు చెప్పుకోవాల‌న్నా అర్థరాత్రి ఫోన్ చేసినా అందుబాటులో ఉంటావు, అందుకే నువ్వు కావాలి” అని అడుగుతున్నారు. ”నేను పోటీ చేయనన్నా… నా వాళ్లంతా ఒత్తిడి చేస్తున్నారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసిన స‌మ‌యంలో నాకు అండ‌గా నిలిచిన వారంద‌రి కోసం, నావారి కోసం, ‘మా’ ఎన్నిక‌ల్లో అధ్యక్ష పదవికి పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్నాను” అని తెలిపారు.