Site icon NTV Telugu

Hebba Patel: సైలెంటుగా మొదలెట్టిన హెబ్బా పటేల్!

Hebba Patel

Hebba Patel

అర్జున్ ఆర్ట్స్ సమర్పణలో చిత్రాలయ క్రియేషన్స్ బ్యానర్ మీద శ్రీలక్ష్మీ.ఎం నిర్మాతగా ప్రొడక్షన్ నెంబర్ 3 రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకి ‘దర్జా’ ఫేమ్ మ్యాక్ (సలీం మాలిక్) దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీలో హెబ్బా పటేల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీని మేకర్లు తాజాగా ప్రకటించారు. ఎమోషన్, కామెడీ ఎంటర్టైన్మెంట్ జానర్‌లో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ సినిమాని భారీ ఎత్తున రూపొందించబోతోన్నారు. ఈ మేరకు నటీనటులు, ఇతర సాంకేతిక బృందానికి సంబంధించిన వివరాల్ని ప్రకటించారు.

Also Read :Nani: బ్లాక్ బస్టర్‌ డైరెక్టర్‌తో నాని.. ఇది మామూలు లైనప్ కాదయ్యా!

‘దర్జా’ మూవీతో అందరినీ మెప్పించిన మ్యాక్ (సలీం మాలిక్) ఈ మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బాధ్యతల్ని నిర్వర్తించనున్నారు. ఆడియెన్స్‌కి కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా, డిఫరెంట్ సబ్జెక్ట్‌లతో ఆకట్టుకునే దర్శకుడు మ్యాక్ (సలీం మాలిక్) ఈ సారి ఓ కొత్త కాన్సెప్ట్‌తో ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నాడు. ఈ ప్రాజెక్ట్‌కి మాటలు, పాటల్ని భాష్యశ్రీ అందించనున్నారు. కేవీఆర్ అడిషనల్ స్క్రీన్ ప్లేని రాశారు. ఎం. సమీర్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చనున్నారు. విష్ణు పానికర్ కెమెరామెన్‌గా పని చేయనున్నారు. ఈ మూవీలో హీరోయిన్‌గా హెబ్బా పటేల్ నటించనున్నారు. మిగిలిన వివరాల్ని చిత్రయూనిట్ త్వరలోనే ప్రకటించనున్నారు.

Exit mobile version