NTV Telugu Site icon

Devara : ఇప్పటివరకు ఓవర్సీస్ లో దేవర క్రియేట్ చేసిన రికార్డ్స్ ఇవే..

Untitled Design (2)

Untitled Design (2)

తారక్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్నపాన్ ఇండియా చిత్రం దేవర. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ దేవరతో టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. అనిరుధ్ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ సూపర్ హిట్ కాగా తాజగా వచ్చిన ట్రైలర్ మిలియన్ వ్యూస్ తో దూసుకెళుతుంది. ఈ చిత్రంలోని ‘ఆయుధ పూజ’ అంటూ సాగే నాలుగవ లిరికల్ సాంగ్ ను వచ్చే వారం విడుదల చేయనున్నారు మేకర్స్.

Also Read : Rao Ramesh : ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదే..

దేవర ఒవర్సీస్ ప్రీ సేల్స్ లో దేవర సరికొత్త రికార్డులు నెలకొల్పుతూ ఇప్పటివరకు ఉన్న రికార్డ్స్ ను బద్దలు కొడుతోంది. ఓవర్సీస్ లో ఈ సినిమాను ప్రత్యంగిరా సినిమాస్ భారీ ఎత్తున రిలీజ్ చేస్తుంది. ఇందుకు సంబంధించి బుకింగ్స్ ఓపెన్ చేయగా రికార్డులు మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది దేవర. ఓవర్సీస్ లో దేవర ఇప్పటివరకు క్రియేట్ చేసిన రికార్డులు గమనిస్తే USA – అత్యంత వేగంగా 15వేలు, 20వేలు, 30వేలు, 35వేలు, టిక్కెట్లు విక్రయింబడిన సినిమాగా దేవర నిలిచింది. అలాగే ఫాస్టెస్ట్ $1M & $1.5M ప్రీ సేల్స్ రాబట్టిన మూవీగా సెన్సషనల్ రికార్డు తన పేరిట నమోదు చేసాడు దేవర. అటు UK లో లిమిటెడ్ బుకింగ్స్ ఓపెన్ చేయగా అత్యంత ఫాస్ట్ గా 10k టిక్కెట్లు బుక్ అయిన సినిమాగా దేవర రికార్డు క్రియే చేసింది.  సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కానున్న ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో నాగవంశీ విడుదల చేస్తున్నాడు.

Show comments