Site icon NTV Telugu

Harsha Sai : ఈ తప్పుడు కేసు వల్ల హర్ష సాయి డబ్బు, ఫేమ్ కోల్పోయాడు!

Untitled Design (21)

Untitled Design (21)

సినిమా పేరుతో తన వద్ద రెండు కోట్లు తీసుకుని, స్టోరీ డిస్కషన్స్ అని తనను గెస్ట్ హౌస్ కు పిలిచి కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చి తనపై అత్యాచారం చచేసాడని, అదంతా వీడియో రికార్డు చేసి, మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేసి పెళ్లి పేరుతో మోసం చేశాడని హర్ష సాయి పై యువతి చేసిన సంగతి తెలిసిందే.కేసు నమోదు చేసిన పోలీసులు పరారిలో ఉన్న హర్ష సాయి కోసం గాలింపు చేపట్టారు. అయితే ఈ కేసులో యూ ట్యూబర్ హర్ష సాయి న్యాయవాది తానికొండ చిరంజీవి మరొక వాదన వినిపిస్తున్నాడు.

Also Read : Harsha Sai : హర్ష సాయి కేసులో నిజానిజాలు.. పూసగుచ్చినట్టుగా..

ఈ అత్యాచార కేసులో హర్ష సాయి బాధితుడు, ఈ తప్పుడు కేసు వల్ల హర్ష సాయి డబ్బు, ఫేమ్ రెండు కోల్పోయాడు. అసలు ఈ వ్యవహారంతో సంబంధం లేని హర్ష సాయి తండ్రిని కూడా కేసులో పెట్టారు. ఆ యువతి వేరే సినిమాలకి హర్ష సాయిని షూరిటీ ఇవ్వాలని కోరటంతో అందుకు హర్ష నిరాకరించాడు దాంతో ఈ వివాదం మొదలైంది. ఫిర్యాదు చేసిన ఆ యువతినీ హర్ష సాయి ఏడాది కాలంగా అసలు కలవలేదు. ఆమె కేవలం డబ్బు కోసం మాత్రమే ఇదంతా చేస్తుంది. హర్ష సాయి వయసు 24 ఏళ్ళు, యువతి వయసు 34 ఏళ్ళు.
ఇద్దరి మధ్య వయసు బేధం బట్టే కేసు ఏంటో అర్థం అవుతుంది. అన్ని విషయాలపై హర్ష సాయి త్వరలోనే మాట్లాడతారు. FIR చూసి లీగల్ గా మేము ముందుకు వెళ్తాం. సినిమా చేస్తున్న సందర్భంలో కొన్నాళ్ళు వీళ్ళు కలిసి ఉన్నారు అంతే తప్ప హర్ష అత్యాచారం చేశాడన్న ఆరోపణలు సరికాదు. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలు” అని తెలిపారు.

Exit mobile version