NTV Telugu Site icon

Harish Shankar: పూరి జగన్నాథ్ తో పోటీపై హరీష్ శంకర్ స్పందన..ఏమన్నాడంటే..?

Untitled Design (17)

Untitled Design (17)

మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ కలయికలో వస్తోన్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. మాస్ కాంబినేషన్ లో రానున్న ఈ సినిమా అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఆదివారం మిస్టర్ బచ్చన్ టీజర్ విడుదల కార్యక్రమం నిర్వహించారు. హీరోయిన్ భాగ్యశ్రీతో పాటు దర్శక నిర్మాతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పూరి జగన్నాధ్, రామ్ పోతినేనిల ‘డబుల్ ఇస్మార్ట్’ కు పోటీగా మిస్టర్ బచ్చన్ వేస్తున్నారా అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా హరీష్ శంకర్ బదులుగా సమాధానం ఇస్తూ ” పూరి జగన్నాధ్ తో నన్ను ఎప్పుడు పోల్చుకోను, అయన ఓక లెజెండరీ డైరెక్టర్, ఆయనతో ఎప్పుడు పోటీ పడను, ఓటీటీ సంస్థల ఒత్తిడి వలన అనుకున్న డేట్ కంటే కొద్దిగా ముందుకు రావడంతో అనుకోకుండా డేట్ క్లాష్ అవుతోంది. ముందుగా డబుల్ ఇస్మార్ట్ డేట్ వేశారు కానీ మాకు ఫైనాన్షియాల్ కారణాల వలన అదే డేట్ కు వస్తున్నాం. ఒక్క సినిమా క్లాష్ వలన పూరికి నాకు మాటలువుండవ్ అని నేను అనుకోను, అయన కూడా అనుకోరు. ఆగస్టు 15న రిలీజ్ చేయమని సలహా ఇచ్చింది మైత్రీమూవీస్ శశి. పూరి మీద పోటీ కోసం కాదు, రామ్ తో పోటీ కాదు, నా తరువాత సినిమా రామ్ తో చేయబోతున్నాను అలాంటప్పుడు క్లాష్ కు ఎందుకు వెళ్తాను, మేము తప్పక రావాల్సివస్తుంది అర్ధంచేసుకుంటారు అని అనుకుంటున్నాను. మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ రెండు బ్లాక్ బస్టర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

Also Read: Olympic Games Paris: పారిస్ ఒలింపిక్స్ లో గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌..రైమ్‌ల‌తో పి.వి.సింధు ఆత్మీయ  క‌ల‌యిక‌

Show comments