Harish Shankar Retunred 2 Crores from Remuneratoins: అప్పుడెప్పుడో మాస్ మహరాజా రవితేజను.. హిందీ మూవీ ‘రైడ్’ని రీమేక్ చేయమంటే.. చేయలేనని చెప్పినట్టుగా మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్‌లో చెప్పుకొచ్చాడు. కానీ ఈ రీమేక్ హరీష్ శంకర్ చేతికి వెళ్లిన తర్వాత.. తాను సై అన్నానని చెప్పాడు రవితేజ. ఎందుకంటే.. హరీష్ శంకర్ రీమేక్‌ను రీమేక్‌లా కాకుండా.. స్ట్రెయిట్ మూవీలా మన నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేయడంలో దిట్ట. గతంలో గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్ సినిమాలను.. ఒరిజినల్ సినిమాల కంటే వావ్ అనేలా రీమేక్ చేశాడు. ఆ నమ్మకంతోనే మాస్ రాజా రైడ్ రీమేక్ చేశాడు. అందుకు తగ్గట్టే.. రిలీజ్‌కు ముందు పాటలు, ప్రమోషన్లతో భారీ హైప్ క్రియేట్ చేశారు. దానికి తోడు మిరపకాయ్ కాంబో మరింత హైప్ ఎక్కించింది. కానీ తీరా థియేటర్లోకి వచ్చాక మిస్టర్ బచ్చన్ రిజల్ట్ తేడా కొట్టేసింది. ఇండిపెండెన్స్ కానుకగా ఆగస్టు 15న రిలీజ్ అయిన మిస్టర్ బచ్చన్ సినిమా.. ఫస్ట్ షో నుంచే నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
Akkineni Family: వరద బాధితులకు అక్కినేని కుటుంబం సాయం ఎంతంటే?
దాని ఫలితం.. నిర్మాతలకు కాస్త గట్టిగానే నష్టాలను మిగిల్చింది ఈ చిత్రం. దీంతో.. హరీష్ శంకర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. హరీష్ తన రెమ్యూనరేషన్ నుంచి 2 కోట్ల రూపాయలు వెనక్కి ఇచ్చినట్టుగా సమాచారం. ఇండస్ట్రీ ఇన్‌సైడ్ టాక్ ప్రకారం.. ఈ సినిమాకు హరీశ్ శంకర్ దర్శకుడిగా దాదాను 10 కోట్ల పారితోషికం తీసుకున్నట్టుగా చెబుతున్నారు. కానీ సినిమా ఫ్లాప్ అవడంతో.. తిరిగి నిర్మాతలకు 2 కోట్లు ఇచ్చినట్లు టాక్. అయితే.. గతంలో కూడా చాలా మంది స్టార్ హీరోలు, దర్శకులు ఫ్లాప్ సినిమాల నష్టాలను పూడ్చేందుకు.. రెమ్యునరేషన్ రిటర్న్ చేసిన సందర్భాలున్నాయి. ఇప్పుడు హరీష్ కూడా అలా చేయడంతో.. రవితేజ అభిమానులతో పాటు అతని ఫాలోవర్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించగా.. యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాతో ఎంతో కొంత లాభపడింది ఎవరైనా ఉన్నారా అంటే? అది హీరోయిన్ మాత్రమే.