NTV Telugu Site icon

Harish Shankar: హరీష్ శంకర్ మొహమాటానికి పోయి ఇరుక్కున్నాడా?

Harish Shankar On Sitar Dance Step

Harish Shankar On Sitar Dance Step

Harish Shankar Intresting Comments on Sitar Song Sekhar Master: రవితేజ హీరోగా భాగ్యశ్రీ హీరోయిన్గా మిస్టర్ బచ్చన్ అనే సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ రిలీజ్ అయింది. అయితే ఒకరోజు ముందుగానే ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ ప్రదర్శించడం జరిగింది. ఈ సినిమాలో పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. అయితే విజువల్ గా మాత్రం సితార్ సాంగ్ లో కొన్ని స్టెప్పులు అభ్యంతర కరంగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా రవితేజ సితార పాటలో డ్యాన్స్ మూవ్‍మెంట్‍లో భాగంగా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే డ్రెస్‍ను ముందు నుంచి పట్టుకునే స్టెప్ ఒకటి కంపోజ్ చేశారు.

Aay: ఆయ్ సినిమాలో వాలంటీర్ల ప్రస్తావన.. బన్నీ వాసు ఏమన్నారంటే?

అయితే, అభ్యంతకరంగా ఉందంటూ ఈ స్టెప్‍కు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే తన మీద కూడా ట్రోల్ చేస్తూ ఉండడంతో నిన్న సక్సెస్ మీట్ లో దీనిపై హరీష్ శంకర్ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్దితి ఏర్పడింది. ఆయన మాట్లాడుతూ ఏదైతే ఈ డ్యాన్స్ మూమెంట్ గురించి చర్చ జరుగుతుందో ఆ డాన్స్ మూవ్మెంట్ తనకు కూడా అంత ఇష్టం లేదని, కానీ ఇప్పుడు మోస్ట్ హపెనింగ్ కొరియోగ్రాఫర్ గా ఉన్న శేఖర్ మాస్టర్ మొదటి రోజే అలా స్టెప్పులు కంపోజ్ చేయగా అది తనకు నచ్చలేదని చెబితే.. ఎక్కడ లో అవుతారో అనుకున్నానని అందుకే కాదు అనలేకపోయానని హరీష్ శంకర్ వివరణ ఇచ్చుకున్నాడు. అంతేకాదు మీరు సాంగ్ లో ఒక ఫ్రేమ్ తీసుకొచ్చి చూస్తే చాలా తప్పులు కనిపిస్తాయి. పాటలో భాగంగా చూస్తే పెద్దగా తప్పు అనిపించదు. పాటని పాటలాగే చూడాలి కానీ మోషన్ ఫోటోగ్రఫీ చేయకూడదు. ఇదే సినిమా సెన్సార్ అయి వచ్చింది అనే సంగతి మీరు మర్చిపోకూడదు అంటూ ఆయన కామెంట్ చేశాడు.

Show comments