పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. మెగా సూర్య బ్యానర్ లో ఏ ఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 24న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది.
Also Read : HHVM : ఎ.ఎం రత్నంపై ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు.. హరిహర రిలీజ్ డౌటే.?
అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేసారు. ఏపీ లో అడ్వాన్స్ బుకింగ్స్ లో హరిహర జోరు చూపిస్తోంది. ఆయితే హరిహర వీరమల్లు నైజాం థియేట్రికల్ రైట్స్ విషయంలో ఇంకా తర్జన భర్జన కొనసాగుతుంది. ఆంధ్ర వరకు ఏరియాల వారీగా ఈ సినిమాను విక్రయించారు. కానీ నైజాం ఎవరు అనే దానిపై కొద్దీ రోజలుగా గందరగోళం నెలకొంది. మొన్నటి వరకు మైత్రీ మూవీస్, దిల్ రాజు పేర్లు వినిపించాయి. అదేమీ లేదు సొంతంగా రిలీజ్ అని టాక్ వినిపించింది. అలాగే అమెరికా సుబ్బారావు అనే మరొక డిస్ట్రిబ్యూటర్ పేరుకూడా వినిపించింది. అయితే ఇవన్నీ వట్టి పుకార్లుగా మిగిలాయి. హరిహర వీరమల్లు నైజాం ఏరియాలో టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తోంది. అయితే ఇప్పటికి ఇంకా బేరాలు జరుగుతున్నాయి రేటు ఫైనల్ కావాల్సి వుంది. నైజాం రైట్స్ విషయంలో నిర్మాత రూ. 45 కోట్లు అడుగుతుండగా మైత్రీ రూ. 35 నుండి 38 కోట్లు వరకు కోట్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ రోజు రేటు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది.
