Hari Hara Veeramallu : వైజాగ్ బీచ్ రోడ్ పై పవన్ హవా.. పవన్ ఫ్యాన్స్‌కి మరో బంపర్ ట్రీట్..

Hari Hara Veeramallu

Hari Hara Veeramallu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల నిరీక్షణ ముగిసింది.. ఆయన నటించిన భారీ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘హరిహర వీరమల్లు’  ఎట్టకేలకు జూలై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. సుమారు ఐదేళ్లుగా వాయిదాల మధ్య సాగిన ఈ సినిమా, ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రాగా.. కేవలం 24 గంటల్లో రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించింది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఒక ధర్మయోధుడిగా చారిత్రక పాత్రలో కనిపించనుండగా, హీరోయిన్‌గా నిధి అగర్వాల్ నటిస్తోంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఔరంగజేబ్ పాత్రలో విరుచుకుపడతాడు. ఇక పోతే..

Also Read : Deepika : దీపిక చూపు ఇప్పుడు టాలీవుడ్ వైపు..

మూవీ రిలీజ్ టైం దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన చిత్ర బృందం, ఇప్పుడు వైజాగ్‌లోని బీచ్ రోడ్ వద్ద ఉన్న ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో (జూలై 23) అంటే ఈ రోజు మరో భారీ ఈవెంట్ ప్లాన్ చేసింది. ఈ కార్యక్రమం సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుండగా.  ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్, దర్శక నిర్మాతలు, నటీనటులతో పాటు, పలు రాజకీయ ప్రముఖులు హాజరు కాబోతున్నారు. అయితే ఈ ఈవెంట్ మొదట తిరుపతి లేదా విజయవాడలో ప్లాన్ చేసిన, అనివార్య కారణాలతో లొకేషన్ మారింది.