Site icon NTV Telugu

HanuMan 3D: హనుమాన్ త్రీడీ వెర్షన్ టెస్టింగ్.. రిలీజ్ ఎప్పుడంటే?

Hanuman

Hanuman

HanuMan 3D Version Testing Done at Prasads PCX: చిన్న సినిమాగా రిలీజ్ అయిన హనుమాన్ ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతూ రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ దూసుకు వెళుతుంది. ఇప్పటికే ఈ సినిమా 250 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు త్వరలోనే 300 కోట్లు వసూలు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే త్రీడీలో రిలీజ్ చేయాలని ఆలోచన చేశామని కాకపోతే ఖర్చు బాగా పెరిగిపోవడంతో పాటు సమయం కూడా బాగా పడుతున్నట్లు తెలియడంతో ఆ ఆలోచన మానుకున్నామని దర్శకుడు ప్రశాంత్ వర్మ పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా యూనిట్ కి సినిమాని త్రీడీలో రిలీజ్ చేయాలని ఆలోచన కలిగినట్లుగా తెలుస్తోంది.

Sundeep Kishan: కుమారి ఆంటీపై కేసు నమోదు.. చాలా అన్యాయం

అందులో భాగంగానే ఒక 30 సెకండ్ల బిట్ ను త్రీడీలోకి కన్వర్ట్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో పరిశీలించడానికి ప్రశాంత్ వర్మ ఈరోజు ప్రసాద్ ఐమాక్స్ కి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ 30 సెకండ్ల బిట్ ను ప్రసాద్ ఐమాక్స్ లోని పీసీఎక్స్ స్క్రీన్ లో చూసిన తర్వాత త్రీడీలో సినిమా చూడడం వర్త్ అని ఆయన నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని టీం దృష్టికి తీసుకెళ్లి సినిమా మొత్తాన్ని 3డిలోకి కన్వెర్ట్ చేసి మళ్లీ రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన కూడా చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఒకవేళ అలా చేయాల్సి వస్తే వేసవికి మరోసారి సినిమాని రిలీజ్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇదంతా ప్రచారమే కాగా నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయనేది తెలియాల్సి ఉంది.

Exit mobile version