NTV Telugu Site icon

Prabhas: హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ..షూటింగ్ ఎప్పుడంటే..?

Untitled Design (7)

Untitled Design (7)

రెబల్ స్టార్ ప్రభాస్ టాలీవుడ్ బిజియస్ట్ హీరో. కల్కి ఇప్పటికి థియేటర్లలో రన్ అవుతుంది. వరల్డ్ వైడ్ గా కల్కి రూ.1100 కోట్లు రాబట్టింది. కల్కి రన్ పూర్తి అవకుండానే మరో చిత్రాన్ని స్టార్ట్ చేసాడు డార్లింగ్. ప్రస్తుతం రాజా సాబ్ చిత్ర షూటింగ్ పాల్గొంటున్నాడు ప్రభాస్. మారుతీ దర్శకత్వంలో రాజాసాబ్ తెరకెక్కుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.. థమన్ సంగీత దర్శకునిగా వ్యయవహరిస్తున్నాడు. సోమవారం విడుదలైన ది రాజాసాబ్ ఫస్ట్ గ్లిమ్స్ సోషల్ మీడియాలో అత్యధిక వ్యూస్ తో రికార్డులు నెలకొల్పుతూ అటు ఫ్యాన్స్ ను ఇటు సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటుంది.

ఈలోగా మరో సినిమాలో నటించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసాడు డార్లింగ్. సీతారామం వంటి హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన హను రాఘవ పూడి రెబల్ స్టార్ తో సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి కథ చర్చలు ఇటీవల ముగిసాయి. స్వాతంత్రానికి ముందు జరిగిన రజాకార్ల ఉద్యమం నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా చిత్రంగా రానుంది. రెబల్ స్టార్ కు జోడిగా ముంబై భామ టాలీవుడ్ కి పరిచయం చేయనున్నాడు హను రాఘవాపుడి. సెప్టెంబరు నుండి ఈ చిత్రాన్ని మొదలుపెట్టనున్నారు. మైత్రి మూవీస్ నిర్మించబోయే ఈ సినిమాకు “ఫౌజి” (Fauji) అనే టైటిల్ ను దాదాపు ఖరారు చేసినట్టు సమాచారం. హను రాఘవపూడి సినిమాలు క్లాస్ ప్రేమకథలు. ప్రభాస్ తో కూడా అటువంటి ప్రేమ కధను తెరకెక్కిస్తారేమోనని ఊహిస్తుండగా, జస్ట్ క్లాస్ టచ్ ఉండే ఊర మాస్ మూవీ అని టీమ్ నుండి సమాచారం అందుతోంది.

Also Read:Kollywood: తమిళ సినిమా నిర్మాతల మండలి షాకింగ్ నిర్ణయం

Show comments