Site icon NTV Telugu

Naga Vamsi : నాగవంశీపై స్కామ్ 1992 డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

Hansal Mehta Naga Vamsi

Hansal Mehta Naga Vamsi

దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా నటించిన ‘లక్కీ బాస్కర్‌’ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి హిట్ అయింది. అయితే అనూహ్యంగా ఈ సినిమాపై కొత్త వివాదం మొదలైంది. ఈ సినిమా నిర్మాత నాగ వంశీ మీద బాలీవుడ్ డైరెక్టర్ ఒకరు తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రముఖ దర్శకుడు హన్సల్ మెహతా తెరకెక్కించిన స్కామ్ 1992 వెబ్ సిరీస్ విపరీతమైన ప్రజాదరణ పొందింది. ఈ సిరీస్ హర్షద్ మెహతా చేసిన షేర్ మార్కెట్ స్కామ్ ఆధారంగా రూపొందించబడింది. అయితే తాజాగా ఈ వెబ్ సిరీస్‌లో ఎక్కువ భాగం విచక్షణారహితంగా దొంగిలించబడిందని హన్సల్ మెహతా ఆరోపించారు. అంతేకాదు హన్సల్ మెహతా నాగవంశీ చాలా అసభ్యంగా ప్రవర్తించాడని విమర్శించారు. అసలు విషయం ఏమిటంటే సినీ ప్రముఖులతో నిర్వహించిన ఒక రౌండ్ టేబుల్ డిబేట్ లో నాగవంశీ మాట్లాడుతూ, బాలీవుడ్ దర్శక నిర్మాతలు ముంబైలోని పాష్ ఏరియాలను దృష్టిలో ఉంచుకుని సినిమాలు తీస్తున్నారని అన్నారు.

RC : రామ్ చరణ్ ‘హుడి’ ధర తెలిస్తే అవాక్కవాల్సిందే

బాంద్రా, జుహూ వంటి ఏరియాలను దృష్టిలో ఉంచుకుని సినిమాలు చేస్తున్నారని అన్నారు. అంతేకాదు పుష్ప 2 సినిమాకి హిందీలో మొదటి రోజు 80 కోట్లు రావడంతో ముంబైలో ఎవరూ నిద్రపోయి ఉండరని సినీ వర్గాల వారిని ఉద్దేశించి వంశీ కామెంట్ చేశారు. అదే డిబేట్లో ఉన్న నిర్మాత బోనీకపూర్‌ను టార్గెట్ చేస్తూ వంశీ ఈ కామెంట్ చేసినట్టు హిందీ సినీ వర్గాల వారు హైలెట్ చేశారు. అయితే ఈ క్రమంలోనే వంశీ ప్రకటన అహంకారపూరితమైనదని హన్సల్ మెహతా విమర్శించారు. మెహతా ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు. అందులో “నాగ వంశీ అనే పెద్దమనిషి చాలా పొగరుగా ఉంటాడు. అతని నిజస్వరూపం ఇప్పుడు నాకు తెలిసింది. అతను నిర్మించిన చిత్రం లక్కీ భాస్కర్ ‘స్కామ్’ అనే వెబ్ సిరీస్‌లోని కంటెంట్‌ను నిర్మొహమాటంగా దొంగిలించి రూపొందించబడింది. తన వెబ్ సిరీస్ ఇతర భాషల్లో సినిమాగా రూపొందడం పట్ల మెహతా సంతోషం వ్యక్తం చేశారు. మెహతా ఇంకా మాట్లాడుతూ, అందరూ గెలుస్తారని, ఇక్కడ ఎవరికన్నా ఎవరూ పెద్దవారు కారు. అహంకారం మరింత ఘోరంగా ఉంటుందని అన్నారు.

Exit mobile version