NTV Telugu Site icon

Director Suicide: ఓయో రూమ్ లో GST సినిమా డైరెక్టర్ ఆత్మహత్య..!

Gst Film Director Susaid

Gst Film Director Susaid

Director Suicide: లాడ్జి గదిలో ఓ చిన్న సినిమా డైరెక్టర్ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read also: Bangladesh Protest : బంగ్లాదేశ్‎కు నాయకత్వం వహించనున్న నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్

నాగర్ కర్నూలుకు చెందిన కొమారి జానయ్యా అలియాస్ కొమారి జానకిరాం ఆదివారం సాయంత్రం కూకట్‌పల్లి భాగ్యనగర్ కాలనీలోని శ్రీ ఆనంద్ఇన్ ఓయో లాడ్జిలో బస చేశాడు. సోమవారం లాడ్జి గది చెక్ అవుట్ చేయాల్సి అంది. అయితే లాడ్జిలో పనిచేసేవారు క్లీనింగ్ కోసం గది తలుపులు కొట్టగా లోపని నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో క్లినింగ్ సిబ్బంది లాడ్డి సిబ్బందికి సమాచారం ఇచ్చారు. గది వద్దకు వచ్చిన లాడ్డి సిబ్బంది కిటికీలు తెరిచి చూడగా జాణయ్య గదిలో ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. దీంతో లాడ్జి సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వెంటనే గదిని తెలిరిచి మృత దేహాన్ని కిందికి దించారు. అతనితో పాటు ఒక బ్యాగ్ ఉందని దానిని కూడా పరీలిస్తామన్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు గతంలో GST(God Saithan Technology) అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో, సొంత బ్యానర్ పై నిర్మించినట్లు గుర్తించారు. అతను ఓయో రూమ్ కు ఎందుకు వచ్చాడు. ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు. ఆర్ధిక పరిస్థితుల వల్ల, లేక కుటుంబ కలహాల వల్లా ఆత్మహత్యకు పాల్పడ్డాడా? లేక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని శవపరీక్షకు గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కాగా.. కొమరి జానయ్య ఆత్మహత్య వార్త తెలుసుకున్న ఇండస్ట్రీ వర్గాలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
Tillu: సిద్దూ జొన్నలగడ్డది ‘తెలుసు కదా’.. మాములుగా ఉండదు..

Show comments