Site icon NTV Telugu

NTR : తాత జయంతి..ఎన్టీఆర్ ట్వీట్ వైరల్..

Ntr Tweet

Ntr Tweet

NTR : విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు గారి గురించి తెలియని వారు వుండరు.నటుడుగా ఎన్నో సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.తెలుగు భాష ఖ్యాతిని ఉన్నత స్థాయికి తీసుకోని వెళ్లిన ఘనుడు ఎన్టీఆర్.ఎన్టీఆర్ నటుడుగా ,నాయకుడుగా ప్రజల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోయారు.తెలుగు సినీ రంగంలో ఎన్టీఆర్ “యుగపురుషుడుగా” నిలిచారు.సినిమాలతో పాటు రాజకీయాలలో కూడా అద్భుతముగా రాణించి అందరి చేత శబాష్ అనిపించుకున్నారు.నేడు మే 28 స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి 101 వ జయంతి సందర్భంగా ఆయన అభిమానులు ఆయనను తలుచుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు.

Read Also :Pushpa 2 Second Single : 6 భాషల్లో పాట పాడిన ఆ స్టార్ సింగర్..?

తాజాగా ఆయన మనవళ్లు అయిన జూనియర్ ఎన్టీఆర్ ,కళ్యాణ్ రామ్ ఉదయాన్నే హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని నివాళులు అర్పించారు.తాతకు తగ్గ మనవడుగా జూనియర్ ఎన్టీఆర్ సినీ రంగంలో దూసుకుపోతున్నారు.ఇప్పుడు ఎన్టీఆర్ రేంజ్ బాగా పెరిగింది.గ్లోబల్ స్థాయిలో ఎన్టీఆర్ గుర్తింపు సాధించారు.ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్ తన తాతయ్య జయంతి సందర్భంగా స్పెషల్ ట్వీట్ చేశారు.”మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతుంది.మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతుంది.పెద్ద మనసుతో ఈ ధరిత్రిని ,ఈ గుండెను ,మరొక్కసారి తాకిపో తాత…సదా మీ ప్రేమకు బానిసను” అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేసారు.ప్రస్తుతం ఈ ట్వీట్ బాగా వైరల్ అవుతుంది.

Exit mobile version