NTV Telugu Site icon

ఇక కేరళలో ప్రభుత్వ ఓటీటీ!

ott

ఓటీటీ వేదిక తొలి లాక్ డౌన్ లో ఏ మేర కొత్త వీక్ష‌కుల‌ను సృష్టించుకుందో.. రెండో ద‌శ లాక్ డౌన్ లో అంత‌కుమించి కొత్త వీక్ష‌కులను సృష్టించుకుంది. ఫ‌లితంగా ఓటీటీ వేదిక‌ల డిమాండ్ విప‌రీతంగా పెరిగిపోయింది. దీంతో ఓటీటీలో విచ్చలవిడిగా ప్రోగ్రామ్స్ నిర్వర్తిస్తున్నారు. ఈ పరిణామాలతో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ప్రైవేట్​ సంస్థలు మాత్రమే నిర్వహిస్తున్న ఓటీటీ తరహా మాధ్యమాన్ని కేరళ ప్రభుత్వమే త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సాజీ చెరియన్ ఓ టీవీ ఛానల్​లో వెల్లడించారు. అలాగే టీవీ ప్రోగ్రామ్స్, సీరియళ్లను సెన్సార్​ పరిధిలోకి తీసుకురానున్నట్లు తెలిపారు.