బాలయ్య – గోపీచంద్ మలినేని కాంబోలో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. రాయలసీమ నేపధ్యంలో వీరసింహ రెడ్డితో సూపర్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని ఈ సారి బాలయ్యతో సరికొత్త ప్రయోగానికి రెడీ అయ్యాడు. లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తున్న సినిమాపై ఇప్పటి నుండి అభిమానుల్లో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. అత్యంత భారీ బడ్జెట్ పై వృద్ధి సినిమాస్ బ్యానర్ లో సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Also Read : RowdyJanardhana : విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్దన’ టీజర్ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే?
NBK111 టైటిల్ తో తెరకెక్కుస్తున్న ఈ సినిమా రెండు వేరు వేరు కాలాలకు చెందిన హిస్టారికల్ స్టోరీగా చరిత్రను, వర్తమానాన్ని ముడిపెడుతూ ఎపిక్ స్టోరీగా రాబోతున్నట్టు తెలుస్తోంది. ఒకరకంగా టైమ్ ట్రావెల్ లాంటి కథలా ఉంటుందని బాలయ్యను మునుపెన్నడు చూడని విధంగా పవర్ఫుల్ గా ఉండబోతుందట. ఇటీవల అఖండ 2 షూటింగ్, ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న బాలయ్య ఇప్పుడు గోపిచంద్ సినిమా సెట్స్ లో అడుగుపెట్టబోతున్నారు. బాలయ్యపై లుక్ టెస్ట్ కూడా నిర్వహించబోతున్నాడు దర్శకుడు. ఈ లోగా లొకేషన్స్ రెక్కీ చేస్తున్నాడు. అందుకోసం ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని ప్లేస్ లు చూస్తోంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు మేకర్స్. ఇక టెక్నికల్ టీమ్ విషయంలోను ఈ సారి ఎక్కడ కంప్రమైజ్ కావడం లేదు మేకర్స్. ఈ సినిమాకు సీనిమాటోగ్రాఫర్ గా కాంతార కు పని చేసిన అర్వింద్ కశ్యప్ ను తీసుకున్నారు. బాలయ్య ఆస్థాన వాయిద్యుడు తమన్ సంగీతం అందిస్తున్నాడు.
