Site icon NTV Telugu

Theater : సింగల్ స్క్రీన్ థియేటర్స్‌కు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..

Single Scrin

Single Scrin

గత కొంత కాలంగా సింగల్ స్క్రీన్ థియేటర్స్ ఒక్కొక్కటిగా క్లోజ్ అవుతున్న విషయం తెలిసిందే. థియేటర్ యజమానులు ఎక్కువగా టికెట్‌లపై ఉన్న జీఎస్టి భారాన్ని సమస్యగా భావిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ రేట్లలో మార్పులు చేసి ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను గమనించి, జీఎస్టి రేట్లలో సానుకూల మార్పులు చేసింది.

Also Read : Kantara Chapter 1: రిషబ్ లాంటి హీరోని నేను ఎక్కడ చూడలేదు..స్టంట్‌ కొరియోగ్రాఫర్‌

తాజా సమాచారం ప్రకారం వంద రూపాయల టికెట్ రేట్ పై ఉన్న పన్నెండు శాతం జీఎస్టి ని 5% ఉండనుంది. దీంతో బి సి సెంటర్స్ లో ఉన్న అనేక థియేటర్స్ కి లబ్ది చేకూరనుంది. ఫలితంగా థియేటర్ల మూసివేత సమస్య కొంత వరకు తీరవచ్చని సినీ ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు. వంద రూపాయల కంటే ఎక్కువ ధర ఉన్న మల్టిప్లెక్స్, ప్రీమియం థియేటర్స్ లో ఉన్న టికెట్ రేట్‌కి యధావిధిగా 18 శాతం జి ఎస్టి యధావిధిగా కొనసాగనుంది. థియేటర్లలో అమ్మే పాప్‌కార్న్ పైన కూడా పన్ను రేట్లలో మార్పు చేశారు. సాల్ట్ పాప్‌కార్న్‌కు 5%, క్యారమెల్ పాప్‌కార్న్‌కు 18% రేటు విధించబడింది. గతంలో పాప్‌కార్న్ ప్యాకేజీ ఆధారంగా వేర్వేరు పన్ను విధించేవారు. ఇప్పుడు ఈ మార్పు ద్వారా ఆ మార్పులు సులభతరం అయ్యాయి.

Exit mobile version