Golden Globes: 2027 అవార్డుల కోసం గోల్డెన్ గ్లోబ్స్ షాకింగ్ రూల్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్స్ (Golden Globes) అవార్డుల నిర్వాహకులు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. 2027లో జరగనున్న 84వ ఎడిషన్ వేడుకల కోసం కృత్రిమ మేధ (AI) వినియోగంపై స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేశారు. ఇటీవల ఆస్కార్ కమిటీ కూడా ఏఐపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో, ఇప్పుడు గోల్డెన్ గ్లోబ్స్ కూడా అదే బాటలో నడుస్తూ మానవ సృజనాత్మకతను కాపాడే దిశగా అడుగులు వేసింది.
కొత్త నిబంధనల ప్రకారం.. సినిమాల్లో లేదా వెబ్ సిరీస్‌లలో ఏఐని ఉపయోగించినంత మాత్రాన ఆ చిత్రాన్ని అవార్డుల రేసు నుంచి తొలగించరు. కానీ, ఆ పనిలో మానవ సృజనాత్మకత, కళాత్మక నిర్ణయాలు ప్రధానంగా ఉండాలి. అంటే ఏఐ కేవలం సహాయకారిగా మాత్రమే ఉండాలి తప్ప, దానికి ప్రాధాన్యత ఉండకూడదు. ముఖ్యంగా ఏదైనా సన్నివేశంలో నటీనటుల వాయిస్‌ని లేదా రూపాన్ని (Likeness) ఏఐతో మార్చినట్లయితే, ఆ వివరాలను ఎంట్రీ సమయంలోనే తప్పనిసరిగా వెల్లడించాలి.
Also Read
- Ramayana : బ్రహ్మ ముహూర్తాన ట్రైలర్.. గురువారం తెల్లవారుజామునే మోగనున్న రికార్డుల మోత!
- Pavala Shyamala: శ్యామల ఎలా 'పావలా శ్యామల' అయ్యారు? చాలా మందికి తెలియని నిజం!
- Allu Arjun: అభిమానుల కోసం బన్నీ స్పెషల్ గిఫ్ట్.. 900 మందికి ఊహించని సర్ప్రైజ్!
- MM Keeravani: బాబు సినిమా కోసం ఇంత టైమ్ ఎందుకు స్వామి?.. 'వారణాసి' రీ రికార్డింగ్‌పై కీరవాణి కీలక నిర్ణయం!
నటన (Acting) విభాగంలో నిబంధనలు మరింత కఠినంగా ఉన్నాయి. పూర్తిగా ఏఐ ద్వారా సృష్టించిన నటనలకు అవార్డులు ఇచ్చే ప్రసక్తే లేదని నిర్వాహకులు తేల్చి చెప్పారు. నటుల అనుమతి లేకుండా వారి డిజిటల్ రూపాన్ని వాడితే అస్సలు అంగీకరించమని స్పష్టం చేశారు. కేవలం నటనకే కాకుండా దర్శకత్వం, రచన, సంగీతం, యానిమేషన్ విభాగాల్లో కూడా ఇదే రూల్ వర్తిస్తుంది. వచ్చే ఏడాది జనవరి 10, 2027న ఈ అవార్డుల వేడుక గ్రాండ్‌గా జరగనుంది. ఈసారి కూడా ప్రముఖ కమెడియన్ నిక్కీ గ్లేజర్ హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు.
తాజావార్తలు
-
ROKO: రోహిత్, కోహ్లీలపై షాకింగ్ కామెంట్స్ చేసిన పాక్ దిగ్గజం… 2027 వరల్డ్ కప్‌లో అసలు ఏం జరగబోతోంది..?
-
Plastic Notes: దేశ కరెన్సీ చరిత్రలో మరో కీలక మార్పు.. ప్లాస్టిక్ నోట్ల ఎంట్రీకి రంగం సిద్ధం!
-
Rohit Sharma: బట్లర్ కోరిక తీర్చిన రోహిత్ శర్మ.. ప్రత్యేక సందేశంతో హిట్ మ్యాన్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఇదే..
-
CM Chandrababu: అమరావతి అంటే 29 గ్రామాలే కాదు.. విజయవాడ-గుంటూరుతో కలిసి అభివృద్ధి..
-
India On PoK: పీఓకే ఎన్నికలు కేవలం నాటకం.. పాకిస్తాన్‌పై భారత్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్‌తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్‌కు మరకలా..? ఈ ట్రిక్‌తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!