Site icon NTV Telugu

ఆగస్ట్ 14న అమెజాన్ లో ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’

Godzilla vs. Kong to stream on Amazon Prime Video from August 14

ఇంగ్లీష్ తో పాటు మూడు భారతీయ భాషలు హిందీ, తెలుగు, తమిళంలో ఆగస్ట్ 14న అమెజాన్ ప్రైమ్ లో ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ స్ట్రీమింగ్ కాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా మంచి సమీక్షలు అందుకున్న ఈ సినిమాను ఆడమ్ వింగార్డ్ తెరకెక్కించారు. మిల్లీ బాబి బ్రౌన్, అలెగ్జాండర్ స్కార్స్ గార్డ్, రెబెక్కా హాల్, బ్రియాన్ టైరీ హెన్రీ, జూలియన్ డెన్సిసన్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ‘కాంగ్: స్కల్ ఐలాండ్ (2017), గాడ్జిల్లా: కింగ్ ఆఫ్ ది మాన్ స్టర్స్ (2019) చిత్రాలకు ఇది సీక్వెల్. అలానే కింగ్ కాంగ్ ఫ్రాంచైజ్ లో ఇది 12వ చిత్రం. ఇక గాడ్జిలా ఫ్రాంచైజ్ లో అయితే 36వ చిత్రం.

Read Also : గన్ను లాంటి కన్నులున్న నోరా ఫతేహి… గన్ను పట్టేసింది!

ఈ తాజా చిత్రంలో రెండు మాన్ స్టర్ ఐకాన్స్ గాడ్జిల్లా, కాంగ్ ఢీకొట్టబోతున్నాయి. దీని గురించి దర్శకుడు ఆడమ్ వింగార్డ్ మాట్లాడుతూ, ”ఇది 1962 నుండి వెండితెరపై జరగని యుద్ధం. కాబట్టి ఆ రెండు భయంకర జీవులకు ఉన్న అభిమానులను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని అత్యద్భుత సాంకేతిక వనరుల సాయంతో తెరకెక్కించాం” అని అన్నారు. ఈ మూవీ ఆగస్ట్ 14న అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ కాబోతున్న దృష్ట్యా వివిధ భాషల్లో దాని ప్రచార చిత్రాన్ని విడదుల చేశారు. ఈ సినిమాను వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్, లెజెండరీ ఎంటర్ టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించాయి.

Exit mobile version