NTV Telugu Site icon

‘టెనెట్’ ను క్రాస్ చేసిన ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’

Godzilla vs Kong Surpasses Tenet Box Office Collections

మాన్ స్టర్ చిత్రాల్లో నాలుగోదైన ‘గాడ్జిలా వర్సెస్ కాంగ్’ కరోనా అనంతరం విడుదలైన సినిమాల్లో కలెక్షన్ల పరంగా అగ్రస్థానంలో నిలిచింది. వార్నర్ బ్రదర్స్ సంస్థ విడుదల చేసిన ‘టెనెట్’ చిత్రం 365 మిలియన్ డాలర్లు వసూలు చేయగా, 390 మిలియన్ డాలర్లతో గ్లోబల్ బాక్సాఫీస్ లో ‘గాడ్జిలా వర్సెస్ కాంగ్’ రికార్డ్ సృష్టించింది. ‘టెనెట్’ మొత్తం రన్ ను ఈ సినిమా రెండువారాల క్రితమే క్రాస్ చేసేసింది. న్యూయార్స్, లాస్ ఏంజెల్స్ లో థియేటర్లు రీ-ఓపెన్ చేసిన తర్వాత విడుదలైన తొలి చిత్రం ఇదే కావడం దీనికి కలిసి వచ్చింది. ఈ సీరిస్ లో వచ్చిన గత మూడు చిత్రాలకంటే చైనాలో ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ అత్యధికంగా 177 మిలియన్ డాలర్లను వసూలు చేయడం విశేషం. ఈ చిత్రం ఆస్ట్రేలియాలో 19.1 మిలియన్ డాలర్లు, మెక్సికోలో 17.3 మిలియన్ డాలర్లు, తైవాన్ లో 12.1 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. విదేశీ వసూళ్ళలో ఒక్క ఐమాక్స్ 28.4 మిలియన్ డాలర్లు వసూలు చేసి, 9 శాతం కలెక్షన్లు సాధించింది. అయితే… యూరప్ లోని పలు దేశాలు ఇంకా కొవిడ్ తో పోరాటం చేస్తుండటంతో అక్కడ లాక్ డౌన్ కొనసాగుతోంది. అలానే నార్త్ అమెరికాలోని 56 శాతం థియేటర్లను తిరిగి ప్రారంభించలేదు. ఇంత ప్రతికూల పరిస్థితుల్లోనూ ‘గాడ్జిలా వర్సెస్ కాంగ్’ చక్కని వసూళ్ళు చేసినట్టేనని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.