Mahendragiri Varahi : థియేటర్లలోకి వారాహి అమ్మవారి ఆగమనం.. ‘మహేంద్రగిరి వారాహి’ టీమ్ వినూత్న ప్రమోషన్స్!

Mgv

Mgv

సుమంత్ నటిస్తున్న మహింద్రగిరి వారాహి టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. చాలా కాలం తర్వాత సుమంత్ ఓ విభిన్నమైన కథతో వస్తుండటం మిస్టికల్ థ్రిల్లర్ జోనర్, వరాహి దేవి సెంటిమెంట్ అన్నీ కలిసి సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో భక్తికి, వెండితెరకు సరికొత్త వారధిని నిర్మిస్తూ చిత్ర పరిశ్రమలో ఒక వినూత్నమైన ప్రమోషనల్ క్యాంపెయిన్‌కు తెరలేపింది మహేంద్రగిరి వారాహి చిత్ర బృందం. కేవలం ఆలయాలకే పరిమితం కాకుండా అమ్మవారి వైభవాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని థియేటర్ల ద్వారా లక్షలాది మంది భక్తులకు చేరవేసేందుకు అమ్మవారి కృపను పొందేందుకు భక్తులందరికీ చిత్ర యూనిట్ ప్రత్యేక ఆహ్వానం పలుకుతోంది.

VarahiAmmavariAagamanam పేరుతో నిర్వహిస్తున్న ఈ గ్రాండ్ ప్రమోషనల్ ఈవెంట్‌లో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం 2:00 గంటలకు హైదరాబాద్, మూసాపేట్‌లోని శ్రీ రాములు థియేటర్ లో వారాహి అమ్మవారి ప్రతిమను ప్రతిష్టించనున్నారు. ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌కు ‘మహేంద్రగిరి వారాహి’ చిత్ర బృందం మొత్తం హాజరుకానుంది. సినిమా ప్రమోషన్స్ కోసం కేవలం ట్రైలర్స్, సాంగ్స్ మాత్రమే కాకుండా భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించేలా థియేటర్లలో విగ్రహాలను ఏర్పాటు చేయబోతున్నారు మేకర్స్. సినిమా థియేటర్లను అమ్మవారి దివ్య సన్నిధులుగా మారుస్తూ లక్షలాది మందిని కనెక్ట్ చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేసింది. ఈ పవిత్రమైన విగ్రహావిష్కరణ వేడుకను కళ్లారా వీక్షించడానికి మరియు వారాహి అమ్మవారి ఆశీస్సులు అందుకోవడానికి భక్తులందరూ తరలిరావాలని చిత్ర యూనిట్ సాదరంగా ఆహ్వానిస్తోంది. సినిమా ప్రమోషన్స్ లో ఇదొక అత్యంత వినూత్నమైన మరియు ప్రతిష్టాత్మకమైన క్యాంపెయిన్‌గా ఇండస్ట్రీలో నిలవనుంది.