NTV Telugu Site icon

మే 11న ‘లైటింగ్ సూరిబాబు’ గ్లిoమ్స్

Glimpse of Lighting Soori Babu on May 11th At 9AM

‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో యంగ్ హీరో సుదీర్ బాబు చేస్తున్న తాజా చిత్రం “శ్రీదేవి సోడా సెంటర్”. ఈ చిత్రాన్ని 70ఎమ్.ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించనున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ మ్యూజిక్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రంలో సుధీర్ బాబు లైటింగ్ కుర్రాడిగా కనిపించనున్నాడు సుధీర్. ఆనంది ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సుధీర్ బాబు లుక్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి మరో అప్డేట్ ను విడుదల చేశారు మేకర్స్. మే 11న ఉదయం 9 గంటలకు ‘లైటింగ్ సూరిబాబు’ గ్లిoమ్స్ విడుదల చేయబోతున్నామంటూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ అప్డేట్ రాగానే గ్లిoమ్స్ విడుదలపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.