Site icon NTV Telugu

Ghantasala : త్వరలో ప్రేక్షకుల ముందుకు ఘంటసాల బయోపిక్

Ghantasala

Ghantasala

సినీ సంగీత ప్రపంచంలో ఘంటసాల వేంకటేశ్వరరావు (ఘంటసాల)వారి చరిత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని ‘ఘంటసాల ది గ్రేట్’ అనే మూవీని అన్యుక్త్ రామ్ పిక్చర్స్ సమర్పణలో శ్రీమతి సి.హెచ్. ఫణి గారు నిర్మాణ సారథ్యంలో సి.హెచ్. రామారావు రచన, దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమాలో కృష్ణ చైతన్య ఘంటసాలగా, మృదుల ఘంటసాల సావిత్రమ్మగా, చిన్న ఘంటసాలగా తులసి మూవీ ఫేమ్ అతులిత నటించగా.. సుమన్ ముఖ్య పాత్రను పోషించారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 12న విడుదల చేయబోతోన్నారు.

Also Read :NMK : నందమూరి మోక్షజ్ఞ.. టాలీవుడ్ ఎంట్రీ ఈ ఏడాది కూడా లేనట్టే?

ఈ క్రమంలో శనివారం నాడు ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను ముఖ్య అతిథిగా హాజరైన ఆదిత్య హాసన్ లాంఛ్ చేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో.. ఆదిత్య హాసన్ మాట్లాడుతూ .. ‘నాకు ఇండస్ట్రీలో అశోక్ అనే మిత్రుడు ద్వారా బాలాజీ గారు, రామారావు గారి వద్ద పని చేసే అవకాశం వచ్చింది. కేవలం పన్నెండు రోజులు మాత్రమే రామారావు గారి వద్ద పని చేశాను. నా ఫస్ట్ రెమ్యూనరేషన్ కూడా రామారావు గారే ఇచ్చారు. ఆ తరువాత ఫారిన్ వెళ్లాను. మళ్లీ గ్యాప్ తీసుకుని వచ్చి సొంతంగా దర్శకుడిగా ఎదిగాను. ‘ఘంటసాల’ స్క్రిప్ట్ ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది. ఈ మూవీని ప్రతీ ఒక్కరూ చూడండి. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్. డిసెంబర్ 12న రానున్న ఈ సినిమాను అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.

Exit mobile version