Site icon NTV Telugu

“పుష్పక విమానం” సాంగ్ రిలీజ్ చేయనున్న సామ్

Get ready for Kalyanam Lyrical on June 18 Launch by Samantha

ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘పుష్పక విమానం’. ‘దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడీస్’ తర్వాత ఆనంద్ దేవరకొండ నటించిన మూడో చిత్రమిది. దామోదరను దర్శకుడిగా పరిచయం చేస్తూ గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ రిషి, ప్రదీప్ ఎర్రబెల్లి దీనిని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ‘పుష్పక విమానం’లో శాన్వి మేఘన, గీత్ సాయిని హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ స్పెషల్ సాంగ్ ను స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని విడుదల చేయనుందని తెలుపుతూ మేకర్స్ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. అందులో జూన్ 18న ఉదయం 11 గంటలకు “కళ్యాణం” అనే లిరికల్ వీడియోను సమంత రిలీజ్ చేయనుందని ప్రకటించారు. ఈ సాంగ్ వెడ్డింగ్ సాంగ్ ఆఫ్ ది సీజన్ అవుతుందని అంటున్నారు మేకర్స్. చూడాలి మరి ఈ సాంగ్ తో ‘పుష్పక విమానం’ టీం ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తుందో…! ఇక ఈ సినిమా విడుదల విషయానికొస్తే… ఓటిటిలో విడుదలవుతుందని అంటున్నారు. కానీ ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ తగ్గడంతో సినిమా థియేటర్లు త్వరలోనే రీఓపెన్ అయ్యే అవకాశం ఉంది. మరి సినిమాను థియేటర్లో ఓపెన్ చేస్తారో లేదంటే ఓటిటిలో విడుదల చేస్తారో చూడాలి.

Exit mobile version