ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో వరుసగా ఒక్కోక్కరు ఏదో ఓ కారణం చేత, అనారోగ్యంతో కన్నుముస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ప్రముఖ అస్సామీ సింగర్ గాయత్రి హజారికా (44) ఇక లేరు. ఇది నిజంగా ఓ చేదు వార్త. గత ఏడాది కాలంగా కొలన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆమె అకాల మరణం పై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ నివాళి అర్పించారు.. ‘ఆమె మరణం అస్సామీ సంగీతానికి తీరని లోటు’ అని ఆయన తెలిపారు. అలాగే పలువురు సినీ, సాంస్కృతిక ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
Also Read ; Sobhan Babu : మా తాత కోరిక నెరవేర్చాను అది చాలు..
‘సరా పాటే పాటే నామే’, ‘జోనాక్ నాశిల్ బనత్’, ‘ఆబేలిర్ హెంగులీ ఆకాశే’ పాటలతో అస్సామీ సంగీత రంగంలో మంచి గుర్తింపు సంపాదించుకున్న గాయత్రి హజారికా ‘యేతియా జోనాక్ నామిశిల్’, ‘మాతో ఏజాక్ బరషున్’, ‘తోమాలై మోర్ మరమ్’ వంటి పాటలు ఆలపించింది. తన మధురమైన గొంతుతో ఎంతోమందిని అలరించిన ఆమె కంఠం, సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేసింది. దీని సంగీత ప్రియులు కొనియాడుతూ ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు.
