టాలీవుడ్ కాంట్రవర్శీ యాక్టర్స్‌లో గాయత్రి గుప్త ఒకరు. ఫిదా, జంధ్యాల రాసిన ప్రేమకథ, సీత ఆన్ ది రెడ్, బుర్రకథ వంటి చిత్రాల్లో లిమిటెడ్ రోల్స్ చేసిన గాయత్రి గుప్తా.. టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూలోనూ.. బిగ్ బాస్ షో బాగోతం పైన నోరు విప్పి హాట్ టాపిక్ అయ్యింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫెమినిజం, పురుషాధిక్యత, వస్త్రధారణ తదితర విషయాల్లో కూడా తన వాయిస్‌ని గట్టిగా వినిపిస్తూ.. ఎవడు ఏమనుకుంటే నాకేంటి? నాకు నచ్చినట్టు నేనుంటే తప్పేంటి? అన్న శైలిలో స్పందిస్తుంటుంది. అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో భాగంగా షాకింగ్ విషయాలు బయట పెట్టింది గాయత్రి గుప్తా..
Also Read : Thammudu : ‘తమ్ముడు’ డబ్బింగ్ పూర్తి చేసిన నితిన్ .. !
‘నేను కూడా పాన్‌సెక్సువల్..’ అని తెలిపింది . అంటే.. ఈ పాన్‌సెక్సువల్ అనేది ఒక రకమైన లైంగిక ధోరణి. ఈ ధోరణిలో ఉన్న వ్యక్తులు ఇతరుల పట్ల లింగం, లైంగిక గుర్తింపు లాంటివి చూసుకోకుండా ప్రేమగా లేదా లైంగికంగా ఆకర్షితులు అవుతారు. అంటే.. పురుషుల పట్ల,మహిళల పట్ల,ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల పట్ల,నాన్-బైనరీ (లింగ నిర్ధారణకు చెందని వ్యక్తులు) పట్ల,జెండర్‌ఫ్లూయిడ్ (లింగ భావన మారుతూ ఉండే వ్యక్తులు) పట్ల వారు త్వరగా ఆకర్షితుల అవుతారు. ఉదాహరణకు.. ఒక పాన్‌సెక్సువల్ వ్యక్తికి ‘నీవు ఆ వ్యక్తి పురుషుడా, మహిళా, ట్రాన్స్‌జెండరా?’ అనే ప్రశ్న ముఖ్యం కాదు. వారికి ఆ వ్యక్తి స్వభావం, వ్యక్తిత్వం, బంధం. ఇలాంటి విషయాని దైర్యంగా బయటకు చెప్పడంతో ప్రజంట్ గాయత్రి గుప్తా మాటలు బాగా ట్రెండ్ అవుతున్నాయి.
