జీ తెలుగు ఈ వారం మరో సినిమాతో మీ ముందుకు రానుంది. థియేటర్లు, ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకున్న సంచలనాత్మక చిత్రం గేమ్ ఛేంజర్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా జీ తెలుగులో ప్రసారం కానుంది. దర్శకుడు శంకర్ రూపొందించిన, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించారు. ఈ ఆదివారం (ఏప్రిల్ 27, 2025) సాయంత్రం 5:30 గంటలకు జీ తెలుగులో సినిమా ప్రసారం కానుంది. గేమ్ ఛేంజర్ కథ విశాఖపట్నంలో కొత్తగా నియమితులైన ఐఏఎస్ కలెక్టర్ రామ్ నందన్ (రామ్ చరణ్) చుట్టూ తిరుగుతుంది. అతని నిజాయితీ మరియు అంకితభావం ముఖ్యమంత్రి సత్యమూర్తి (శ్రీకాంత్) కుమారుడైన బొబ్బిలి మోపిదేవి (ఎస్‌జె సూర్య)తో సంఘర్షణకు దారితీస్తుంది.
మోపిదేవి అక్రమ కార్యకలాపాల్లో మునిగి ఉంటాడు. రామ్ నందన్ ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమిస్తాడు? అతను ముఖ్యమంత్రి అవుతాడా? మోపిదేవి తన లక్ష్యాల కోసం ఎంతవరకు వెళ్తాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి ఈ ఆదివారం జీ తెలుగులో గేమ్ ఛేంజర్ చూడండి! ఈ చిత్రంలో రామ్ చరణ్, కియారా అద్వానీతో పాటు ఎస్‌జె సూర్య, అంజలి, శ్రీకాంత్, సముద్రఖని వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ సినిమాకు ఎస్. థమన్ సంగీతం అందించారు.
