NTV Telugu Site icon

Game Changer Teaser Review: ఇది నిజంగానే ఊహాతీతం మాస్టారూ!

Game Changer Reviw

Game Changer Reviw

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాతగా ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది కానీ శంకర్ భారతీయుడు కమిట్మెంట్స్ కారణంగా అనేక వాయిదాలు పడుతూ వచ్చింది. డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ప్రచారం జరిగిన ఈ సినిమా ఎట్టకేలకు సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈరోజు ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు. లక్నోలోని ప్రతిభ థియేటర్లో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న రామ్ చరణ్, కియారా అద్వానీ టీజర్ లాంచ్ ఘనంగా నిర్వహించారు.

Game Changer Teaser: మైండ్ బ్లాకయ్యేలా గేమ్ ఛేంజర్ టీజర్.. చూశారా?

ఇక ఈ టీజర్ పరిశీలిస్తే మొదటి షాట్ నుంచి చివరి షాట్ వరకు చాలా రిచ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. రామ్ చరణ్ ఒక ప్రభుత్వ అధికారిగా కనిపిస్తూనే మరోపక్క మరో క్యారెక్టర్ లో కూడా కనిపించబోతున్నట్లు హింట్ ఇచ్చారు. అయితే ఒకే రాంచరణ్ ఇద్దరిగా వేషధారణ చేస్తాడా? లేక రెండు రాంచరణ్ పాత్రలు ఉన్నాయా? అనే విషయం మీద క్లారిటీ ఇవ్వకుండానే టీజర్ కట్ ఉంది. ఇది ఒక పొలిటికల్ థ్రిల్లర్ అనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే శ్రీకాంత్, ఎస్జె సూర్య, నవీన్ చంద్ర వంటి వాళ్లు తమ తమ పాత్రలలో కనిపిస్తున్నారు. వాళ్లు కనిపించింది ఒక షాట్ లోనే అయినా వారి గత పాత్రల కంటే భిన్నంగా ఏదో చేయబోతున్నారని అని అనిపిస్తోంది. ఇక డైలాగ్స్ కూడా ఆకట్టుకునేలా రాసుకున్నారు. ముఖ్యంగా నేను ఊహాతీతం అంటూ ఇంగ్లీషులో రామ్ చరణ్ చేత చివర్లో చెప్పించిన డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది.

Show comments