తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా గద్దర్ అవార్డులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి, ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో చివరిగా ఈ అవార్డులు 2011 సంవత్సరంలో రిలీజైన సినిమాలకు సంబంధించి 2013 సంవత్సరంలో అత్యుత్తమ చిత్రాలకు, అత్యుత్తమ నటీనటులు, టెక్నీషియన్లకు అందజేశారు. అప్పటి లెక్కల ప్రకారం, బెస్ట్ సినిమా ప్రొడ్యూసర్‌కు ₹75,000, ఆ సినిమా డైరెక్టర్‌కు ₹30,000 ఇచ్చారు.
Manchu Vishnu : మంచు విష్ణు’ని హర్ట్ చేసిన శ్రీవిష్ణు
అయితే, ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ విషయంలో సినిమా నిర్మాతకు ₹10 లక్షలు, దర్శకుడికి ₹7 లక్షలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే జాతీయ చలనచిత్ర అవార్డులతో సమానంగా లేదా అంతకంటే ఎక్కువ ప్రైజ్ మనీ ఇచ్చేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
NTR Neel: ఆ ఊరిలో ఎన్టీఆర్ – నీల్ షూట్
ఇక, ముందుగా అవార్డులను అన్ని సంవత్సరాలకు ఇస్తారని చెప్పినప్పటికీ, 2024 సినిమాలకు మాత్రం జూన్ 14వ తేదీన జరగబోయే ఒక ఈవెంట్‌లో ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ కన్వెన్షన్ సెంటర్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రభుత్వం తరఫున ఈ వేడుకను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.
