Site icon NTV Telugu

Gadadhari Hanuman: అంచనాలు పెంచేలా ‘గదాధారి హనుమాన్’ టీజర్

Gadhadhari

Gadhadhari

మైథలాజికల్ జానర్‌లో అత్యంత భారీ చిత్రంగా విరభ్ స్టూడియో బ్యానర్ మీద రేణుకా ప్రసాద్, బసవరాజ్ హురకడ్లి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘గదాధారి హనుమాన్’. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కించిన ఈ చిత్రంలో రవి కిరణ్ హీరోగా నటించారు. ఈ మూవీకి రోహిత్ కొల్లి దర్శకత్వం వహించారు. శుక్రవారం నాడు ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్, రాజ్ కందుకూరి, డైరెక్టర్ సముద్ర వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు రోహిత్ కొల్లి మాట్లాడుతూ .. ‘‘గదాధారి హనుమాన్’ సినిమాతో నేను మూడేళ్లు ప్రయాణం చేశాను.

Also Read:Prabhas: ప్రభాస్ దేవుడి బిడ్డ.. యూట్యూబర్ కామెంట్స్ వైరల్!

బసవ సర్‌తో ఈ జర్నీ ప్రారంభమైంది. అప్పుడు చాలా సింపుల్ కాన్సెప్ట్‌తో మూవీ అనుకున్నాం. కానీ మా రవి గారు జాయిన్ అవ్వడంతో స్పాన్ మారిపోయింది. అందుకే ఇప్పుడు ఇలా పాన్ ఇండియా స్థాయిలో మూవీని తీసుకు వస్తున్నాం. రవి కిరణ్ ఈ చిత్రంలో అన్ని రకాల ఎమోషన్స్‌ను అద్భుతంగా పండించారు. హర్షిత చక్కగా నటించారు. రేణుకా ప్రసాద్ గారు ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదు. ఈ మూవీ గ్లింప్స్, టీజర్ ఇలా అన్నింట్లోనూ గదనే ఎక్కువగా చూపించాం. గద ఎంత పవర్ ఫుల్ అన్న దానిపై ఓ సీక్వెన్స్ కూడా మా చిత్రంలో అద్భుతంగా ఉంటుంది. మా టీజర్ అందరికీ నచ్చి ఉంటుందని భావిస్తున్నాం. మా చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు.

Exit mobile version