Site icon NTV Telugu

Adivi Sesh: గూఢచారి 2 రిలీజ్ అప్పుడే

Adivi Sesh

Adivi Sesh

బ్లాక్ బస్టర్ స్పై థ్రిల్లర్ గూఢచారికి సిక్వెల్‌గా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘G2’ 2026 మే 1న వరల్డ్ వైడ్ థియేటర్లలో రిలీజ్ అవుతుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. అడివి శేష్ హీరోగా మరో సరికొత్త మిషన్‌కి రెడీ అవుతున్న ఈ సినిమాకి గ్రాండ్ లెవెల్ పోస్టర్స్‌తో రిలీజ్ డేట్‌ని ఎనౌన్స్ చేశారు. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం, ఫస్ట్ పార్ట్ గూఢచారి సక్సెస్‌ను బేస్‌గా తీసుకుని అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్నారు. 150 రోజుల పాటు, 6 దేశాల్లో షూటింగ్ చేసి, 23 భారీ సెట్లతో తెరకెక్కించిన ఈ మూవీ, ఇండియన్ సినిమాలో స్పై థ్రిల్లర్ జానర్‌ ని రీడిఫైన్ చేయనుంది.

Also Read:Film Chamber : ఛాంబర్ సంచలన నిర్ణయం.. ఇక ఎవరితో అయినా షూటింగ్ చేసుకోవచ్చు!

ఈసారి ఏజెంట్ 116గా వామికా గబ్బి ఎంట్రీ ఇస్తోంది. యాక్షన్‌తో పాటు ఎమోషన్‌ వున్న క్యారెక్టర్ ఇది. ఈ మూవీతో ఇమ్రాన్ హష్మీ తొలిసారి తెలుగు తెరపై కనిపించబోతున్నారు. అలాగే మురళీ శర్మ, సుప్రియా యార్లగడ్డ, మధు శాలిని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై టి.జి. విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నారు. తెలుగు తో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియాగా రిలీజ్ కానుంది.

Exit mobile version