మూవీ క్రిటిక్, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ కత్తి మహేష్ ఆరోగ్యానికి సంబంధించి తాజా అప్డేట్ వచ్చింది. మహేష్ కత్తి ఆరోగ్యం గురించి చాలా మంది ఫోన్ చేస్తున్నారు. హాస్పిటల్ ఖర్చుల కోసం ఆయనకు సహాయం చేస్తామని చాలామంది ముందుకు వస్తున్నారు. అయితే హాస్పిటల్ ఖర్చుల కంటే రాబోయే రోజుల్లో కత్తి రీహాబిలిటేషన్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కత్తి హెల్త్ రీకవరీ అండ్ రీహాబిలిటేషన్ ఫండ్ ఒకటి క్రియేట్ చేయాలని ఆలోచిస్తున్నాం. ఇప్పటివరకూ ఎవరి వద్ద నుంచీ ఎటువంటి ఫండ్స్ తీసుకోలేదు. వారి కుటుంబం, హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల డబ్బుల అవసరం రాలేదు. కాకపోతే కత్తి ఇంకో మూడు వారాల పైనే హాస్పిటల్ లో ఉండాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత కూడా రికవరీకి సమయం పడ్తుంది. ఈ ఫండ్ ఏదైనా 80G రిజిస్టర్డ్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేద్దామనే ఆలోచనలో ఉన్నాము. కొంతమందితో సంప్రదిస్తున్నాం. రేపట్నుంచి ఫండ్ రైజింగ్ చేయాలనే ఆలోచనతో ఉన్నాము అని ఆయన సన్నిహితులు తెలిపారు. ఇక ఈరోజు మధ్యాహ్నం కత్తికి కార్నియోఫేషియల్ రికన్స్ట్రక్షన్ ఆపరేషన్ చేయనున్నారు డాక్టర్లు. ఆ తరువాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.
Read Also : కాపీ రైట్స్ వివాదంలో కంగనా మూవీ…!
శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్ తల, కంటికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన స్వస్థలమైన పీలేరు వెళ్తుండగా నెల్లూరు హైవే చంద్రశేఖరపురం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ సీటుబెల్టు పెట్టుకోవడం వల్ల పెద్దగా గాయపడలేదు. కానీ కత్తికి మాత్రం బాగానే గాయపడ్డాడు. యాక్సిడెంట్ అయిన వెంటనే అపస్మారకస్థితిలోకి వెళ్లిన కత్తిని వెంటనే దగ్గరలో ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం ఆయనను చెన్నై లోని అపోలో ఆసుపత్రికి తరలించారు బంధువులు.