NTV Telugu Site icon

AlluArjun : ‘పుష్ప-2’ ట్రైలర్‌పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే కామెంట్స్ వైరల్!

Pushpa

Pushpa

మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తూ ప్రేక్షకులు ముందుకు రాబోతున్న చిత్రం పుష్ప 2. పుష్ప 1కు సీక్వెల్ గా ఈ చిత్రం రాబోతుంది. సుమారు పార్ట్ 1 వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత ఈ చిత్రం రావడం విశేషం. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా నవీన్ నూలి ఎడిటర్ గా ఈ చిత్రానికి పనిచేయడం మరింత విశేషం. సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. బీహార్ రాజధాని పాట్నాలో ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ చేసారు మేకర్స్.

Also Read : Vijay Devarakonda : రష్మిక తో లవ్ కన్ఫామ్ చేసినట్టేనా..?

కాగా పుష్ప ట్రైలర్ పై అటు టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు అద్భుతమని కొనియాడుతున్నారు. అల్లూ అర్జున్ అదరగొట్టాడు అని కితాబు నిస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ కు చెందిన నంద్యాల మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత శిల్ప రవి చేసిన కామెంట్ ఇప్పడు టాక్ అఫ్ ది టౌన్. పుష్ప ట్రైలర్ పై లాట్స్ అఫ్ లవ్.. పుష్ప వైల్డ్ ఫైర్ వెండితెరపై చూసేందుకు ఈగర్ గా ఎదురుచూస్తున్నాను అని ట్వీట్ చేస్తూ పుష్ప ప్రమోషన్స్ కు చెందిన కొన్ని వస్తువులను ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసారు,. అందుకు బదులుగా అల్లు అర్జున్ స్పందిస్తూ ని ప్రేమకు థాంక్యూ బ్రదర్ అంటూ రిప్లై ఇచ్చారు. 2024 ఎన్నికల్లో శిల్ప రవి కోసం నంద్యాల వెళ్లడంతో అల్లు vs మెగా ఫ్యాన్స్ గా విడిపోయిన సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Show comments