Site icon NTV Telugu

FNCC: మే డే.. ఎంప్లాయిస్ ని సత్కరించిన ఎఫ్ఎన్సిసి

May

May

MAYDAY: మే డే సందర్భంగా ఎఫ్ ఎన్ సి సి ఎంప్లాయిస్ వారి ఫ్యామిలీస్ అందర్నీ ఘనంగా సత్కరించారు కమిటీ సభ్యులు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాగంటి మురళీమోహన్, నారాయణ మూర్తి, పరుచూరి గోపాలకృష్ణ , హీరో శ్రీకాంత్, FNCC ఫార్మర్ ప్రెసిడెంట్ డాక్టర్ కే. ఎల్. నారాయణ, నిర్మాత కె. ఎస్. రామారావు, FNCC ప్రెసిడెంట్ ఆదిశేషగిరిరావు, వైస్ ప్రెసిడెంట్ టి. రంగారావు, సెక్రటరీ ముళ్లపూడి మోహన్, జాయింట్ సెక్రటరీ వి. వి. ఎస్. ఎస్. పెద్దిరాజు, ట్రెజరర్ బి. రాజశేఖర్ రెడ్డి, కమిటీ మెంబర్స్ శ్రీ ఏడిద సతీష్, బాలరాజు, మరియు కల్చరల్ కమిటీ చైర్మన్ తమ్మారెడ్డి భరద్వాజ్ పాల్గొన్నారు.

Also Read; Anil Ravipudi-IPL: ఐపీఎల్ మ్యాచ్‌లపై కామెంట్స్.. డైరెక్టర్ అనిల్ రావిపూడిని ఆడుకుంటున్న ఫాన్స్!

ఈ సందర్భంగా FNCC ప్రెసిడెంట్ ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ : FNCC సంస్థ 1993 జూన్ లో స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈరోజు వరకు పనిచేస్తున్న ఎంప్లాయిస్ ఉన్నారు. అదేవిధంగా మధ్యలో జాయిన్ అయ్యే నమ్మకంగా ఈరోజు వరకు ఎంప్లాయిస్ కూడా ఉన్నారు. ఈ రోజున FNCC లో ఇన్ని కార్యక్రమాలు జరిగి ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి కారణం కష్టపడి పనిచేసే ప్రతి ఒక్క ఎంప్లాయ్. కావున ఈరోజు మే డే సందర్భంగా ఎంప్లాయిస్ అందర్నీ సత్కరించుకోవాలని కమిటీ నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఎంప్లాయిస్ నుంచి ఇదే సపోర్ట్ రానున్న సంవత్సరాల్లో కూడా ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము అని అన్నారు.

Exit mobile version