కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం “సన్ ఆఫ్ ఇండియా”. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. నిజజీవిత సంఘటనల ఆధారంగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. “సన్ ఆఫ్ ఇండియా” చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకుడు మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా “సన్ ఆఫ్ ఇండియా” ఫస్ట్ సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రానికి సంబంధించి 11వ శతాబ్దపు రఘువీరా గద్యం మాస్ట్రో ఇళయరాజా గారి సంగీత సారథ్యంలో రాహుల్ నంబియార్ స్వరంతో రూపుదిద్దుకున్న లిరికల్ వీడియో సాంగ్ ‘జయ జయ మహావీర’ను రిలీజ్ చేశారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా ఈ సాంగ్ ను షేర్ చేస్తూ “భారతీయ సినిమా పరిశ్రమలోని ఇద్దరు దిగ్గజాలు .. ప్రముఖ తెలుగు నటుడు ఎం మోహన్ బాబు, మాస్ట్రో ఇళయరాజా కలిసి రాముడి శౌర్యానికి నివాళులర్పించిన ‘రఘువీరా గద్యం’లోని సాంగ్ ‘జయ జయ మహావీర’ సాంగ్. ఆల్ ది బెస్ట్” అంటూ ట్వీట్ చేశారు.
“సన్ ఆఫ్ ఇండియా” ఫస్ట్ సాంగ్ వచ్చేసింది…!
