Site icon NTV Telugu

Jani Master : పరారీలో జానీ మాస్టర్.. బాధిత మహిళ కూడా? ఏ క్షణమైనా అరెస్ట్??

Jani Master Missing

Jani Master Missing

FIR Filed On Coreographer Jani Master Missing: ప్రముఖ కొరియోగ్రాఫర్ ఈ మధ్యనే జాతీయ అవార్డు సైతం ప్రకటించబడిన జానీ మాస్టర్ తనను పలు సందర్భాల్లో రేప్ చేశాడని లైంగిక వేధింపులకు గురి చేశాడని ఆయన దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తున్న ఒక యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేయగా దాన్ని నార్సింగి పోలీస్ స్టేషన్ కి జీరో ఎఫ్ఐఆర్ గా ట్రాన్స్ఫర్ చేశారు పోలీసులు. ఇక తనను ముంబై, చెన్నై లాంటి ప్రాంతాలకు తీసుకు వెళ్ళినప్పుడు హైదరాబాద్ లోని తన నివాసంలో పలుసార్లు జానీ మాస్టర్ రేప్ చేశాడని, మతం మార్చుకోమని బలవంతం పెట్టాడని, అప్పుడు పెళ్లి చేసుకుంటానంటూ వేధించేవాడని ఆమె ఆరోపించింది. అయితే పోలీసులు జీరో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసిన తర్వాత ఆమె ఆరోపణల మీద స్పందించాల్సిందిగా జానీ మాస్టర్ను సంప్రదించే ప్రయత్నం చేయగా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నట్లుగా తెలుస్తోంది.

Ramnagar Bunny : ఆసక్తికరంగా రామ్ నగర్ బన్నీ టీజర్.. చూశారా?

జానీ మాస్టర్ అసిస్టెంట్లు ఇద్దరికీ ఫోన్ చేసినా కూడా వాళ్లు కూడా అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నాడని పోలీసులు పేర్కొంటున్నారు. అయితే మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పోలీసులకు ఫిర్యాదు చేసిన సదరు యువతి కూడా ప్రస్తుతానికి పోలీసులకు అందుబాటులో లేనని చెప్పినట్లుగా తెలుస్తోంది. తాను ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నానని హైదరాబాద్ వచ్చిన తర్వాత తాను పోలీసులను కలిసి పూర్తి వివరాలు అందించడమే కాదు ఆధారాలు కూడా అందిస్తానని చెబుతున్నట్లుగా తెలుస్తోంది. జనసేనలో ప్రచార కమిటీ బాధ్యతలు నిర్వహించిన జానీ మాస్టర్ను ప్రస్తుతానికి జనసేన పార్టీ సస్పెండ్ చేసినట్లే చెప్పాలి. ఇక కొరియోగ్రాఫర్ అసోసియేషన్ కూడా జానీ మాస్టర్ మీద ఫైర్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆయన దానికి అధ్యక్షుడిగా ఉన్నారు. అసోసియేషన్ బైలాస్ ప్రకారం ఆయనను తప్పించాలని పలువురు కొరియోగ్రాఫర్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version