Site icon NTV Telugu

గుండెపోటుతో మరణించిన హారర్ చిత్రాల నిర్మాత…

Filmmaker Kumar Ramsay dies of cardiac arrest at 85

బాలీవుడ్ సినీ నిర్మాత కుమార్ రామ్సే గురువారం ముంబైలో మరణించారు. 85 ఏళ్ల ఆయన ఉదయం వేళ గుండెపోటుతో తుది శ్వాస విడిచాడు. ఆయనకు భార్య, ముగ్గురు కొడుకులు.
నిర్మాత కుమార్ కొడుకు గోపాల్ చెప్పిన దాని ప్రకారం… ఆయన ఉదయం 5.30 గంటలకు కార్డియాక్ అరెస్ట్ కారణంగా తనువు చాలించినట్లు తెలిపాడు. మధ్యాహ్నం పన్నెండు గంటలకు అంత్యక్రియలు జరిగాయి. నిర్మాత ఎఫ్ యూ రామ్సే పెద్ద కుమారుడైన కుమార్ రామ్సేకి తులసీ, శ్యామ్, కేశు, కిరణ్, గంగూ, అర్జున్ రామ్సేలు తమ్ముళ్లు. అందరూ బాలీవుడ్ లోనే ఫిల్మ్ మేకర్స్ గా కొనసాగారు. ముఖ్యంగా, హారర్ జానర్ లో లో బడ్జెట్ మూవీస్ తో రామ్సే సోదరులు 70లు, 80లలో బాక్సాఫీస్ వద్ద భారీ హిట్లు నమోదు చేశారు.

Read Also : జూలై 31 నుంచీ… ‘జీ టీవీ’లో జబర్ధస్త్ కామెడీ!

కుమార్ రామ్సే నిర్మాతగానే కాక రచయితగానూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ‘ఏక్ నన్హీ మున్నీ లడ్కీ థీ, దో గా జమీన్ కే నీచే, పురాణా మందిర్, సాయా, ఖోజ్’ లాంటి చిత్రాలు ఆయన రాసినవే. ఇక రామ్సే బ్రదర్స్ లో పెద్దవాడైన కుమార్ కంటే ముందే అతడి తమ్ముళ్లు అందరూ మరణించారు. ఇప్పుడు కేవలం గంగూ రామ్సే మాత్రం బతికి ఉన్నాడు.

Exit mobile version