Fatima Sana Sheikh: అవకాశాల కోసం హైదరాబాద్ వస్తే ప**వాలన్నారు.. దంగల్ నటి సంచలనం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటి ఫాతిమా సనా షేక్ అమీర్ ఖాన్ చిత్రం ‘దంగల్’లో అద్భుతమైన నటనతో వార్తల్లో నిలిచింది. ఒక ఇంటర్వ్యూలో, ఫాతిమా తన సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి మాట్లాడింది. ముంబైలోని నటీనటులను కాస్టింగ్ డైరెక్టర్లు ఎలా వాడుకుంటున్నారనే దాని గురించి ఆమె మాట్లాడింది. కాస్టింగ్ డైరెక్టర్లు నటీనటుల సంపాదనలో వాటాను డిమాండ్ చేస్తారని చెప్పింది. స్టూడియోలో ఆడిషన్స్ జరిగేవని, ఎంపికైన అనంతరం నటీనటుల రెమ్యునరేషన్ లో కొంత భాగాన్ని అదే కాస్టింగ్ డైరెక్టర్ ఉంచుకుని మిగతా డబ్బు ఇస్తారని ఆమె కామెంట్ చేసింది. ప్రతి ఒక్కరూ తమ రెమ్యునరేషన్ లో 15 శాతం కాస్టింగ్ డైరెక్టర్లకు ఇవ్వాలని ఫాతిమా ఆరోపించింది. అంతేకాక ఆమె మాట్లాడుతూ తనను సౌత్ కి వెళ్లి అక్కడ కొన్ని సినిమాలు చేసి తిరిగి ముంబై వస్తే మంచి అవకాశాలు వస్తాయని చెప్పారని ఈ క్రమంలోనే తాను సౌత్ సినిమాలు చేసేందుకు ప్రయత్నించానని చెప్పకొచ్చింది. అలా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో మీరు అన్నింటికీ రెడీ కదా అని అడిగే వారని నేను నా పాత్ర కోసం ఎంత కష్టపడడానికైనా రెడీ అని చెప్పేదాన్ని ఆమె చెప్పుకొచ్చింది.
Thandel Pre Release Event : తండేల్ రాజు కోసం రంగంలోకి పుష్ప రాజ్?
Also Read
వాళ్లకు నాకు అర్థం కాలేదనే విషయం అర్థమై తర్వాత ఆ విషయం మీద పెద్దగా ఫోకస్ చేసే వారు కాదని పేర్కొంది. ఇక ఒకానొక సందర్భంలో హైదరాబాద్ వచ్చినప్పుడు కొంతమంది నిర్మాతలు వారి దగ్గరికి వెళ్ళాలి వీరి దగ్గరికి వెళ్లాలి ఇదంతా కామన్ అన్నట్లుగా మాట్లాడే వారని ఆమె చెప్పుకొచ్చింది. అయితే అందరూ ఒకలాగా ఉండరు అనే విషయం నేను వాళ్లకి చెప్పి పక్కకి వచ్చేశానని ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చింది. ఆ నిర్మాతలు చాలా ఓపెన్ గా మీరు వేర్వేరు వ్యక్తులని కలవాల్సి ఉంటుంది అన్నారు. క్లియర్ గా చెప్పడం లేదు కానీ నాకు విషయం అర్థం అయ్యేలా చెబుతున్నారు. వాళ్లని వీళ్ళని కలవాల్సి ఉంటుంది అలా చేయాల్సి ఉంటుంది ఇలా చేయాల్సి ఉంటుంది అని అనేవారు. కానీ అందరూ ఒకేలా ఉండరు అని ఆమె చెప్పుకొచ్చారు. కొంతమంది మీరు అడిగినట్లు చేసి ఉండొచ్చు కానీ నేను అలా చేయలేనని చెప్పాను, నిజానికి ఇలా బాధింపబడిన వారి గురించి వింటే చాలా బాధ కలుగుతుంది అంటూ ఆమె చెప్పుకొచ్చింది.
- Tags
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
-
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!